calender_icon.png 24 August, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూఢ నమ్మకాలపై అవగాహన

24-04-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 23(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బజారు వాడి, పొట్టి శ్రీరా ములు చౌక్ వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాధనసూరుల విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లా చెల్లూరు గ్రామానికి చెందిన చింతకింది సుదర్శన్ బృందం విన్యా సా లు చేశారు.

సమాజంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడం తమ కులవృత్తిగా మార్చుకున్నట్లు సుదర్శన్ తెలిపారు. తము చేస్తున్న విన్యాసాలు ఎలాంటి మాయ మంత్రాలతో కూడుకున్నది కాదని, ఇది ఒక విద్యా అని తెలిపారు. తమ తాతల కాలం నుంచి ఈ విద్యను నమ్ముకొని జీవనం సాగిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.