22-12-2025 11:21:08 PM
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని మోడల్ స్కూల్ లో నిర్వహించిన విద్యార్థుల కంటి పరీక్షల (స్క్రీనింగ్) కార్యక్రమం ను సోమవారం పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు అన్ని పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
కంటి సమస్యలున్న వారిని గుర్తించి సమస్యలను సరిచేయడం ( రిఫ్రాక్టివ్ ఎర్రర్ లను సరి చేయుట), సరిచేయలేని కంటి సమస్యలున్న వారిని ఉన్నత ఆసుపత్రిలో చికిత్స చేయించడం జరుగుతుంది అని అన్నారు. తదనంతరం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సుల్తానాబాద్ లో జరిగిన ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ యందు పాల్గొన్నారు. మాక్ డ్రిల్ ను డాక్టర్ సిరి చందన నిర్వహించారు.ఈ కార్యక్రమంలలో వీరి వెంట ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ బి శ్రీరాములు, ఆప్తాల్మిక్ ఆఫీసర్ అజయ్ కుమార్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, సిబ్బంది, సి ఎచ్ సి సుల్తానాబాద్ మెడికల్ సూపరింటెండ్ డా.రమాదేవి, ఇతర డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.