calender_icon.png 23 December, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్న అక్షయ పాత్ర సేవలు అనిర్వచనీయం

22-12-2025 11:11:08 PM

హనుమకొండ/వరంగల్,(విజయక్రాంతి): పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్న అక్షయ పాత్ర  సేవలు అనిర్వచనీయం అని రాష్ట్ర దేవాదాయ అటవి పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.నగర పరిధి 14వ డివిజన్ ఎనుమాముల ప్రాంతంలో ఇస్కాన్ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం (సిఎస్ఆర్)లో భాగంగా హెచ్డిబి సహకారంతో అధునాతనం గా ఏర్పాటు చేసిన వంటశాల యంత్రాలను సోమవారం మంత్రి  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇస్కాన్ సేవా సంస్థ వారు ఎనుమాముల ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిచెన్ యంత్రాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ అంటే తెలియని వారు ఉండరని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు పొందిన ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ అని కృష్ణ చైతన్యాన్ని విశ్వ వ్యాప్తం చేయడానికి ఏర్పడిందని అనేక విద్యా సంస్థలను సంస్థ నడుపుతుందని హరే కృష్ణ సంకీర్తన ఉచిత ప్రసాద వితరణ ఎంతో ప్రసిద్ధి చెందినది.

  తెలుగు రాష్ట్రాల్లో వీరు నిర్మించిన ఆలయాలు ఎంతో ప్రతిష్ట పొందాయని అక్షయ పాత్ర ఫౌండేషన్ అనునది ఇస్కాన్ కు అనుబంధం గా పని చేస్తుందని ఈ సంస్థ బెంగుళూరు కేంద్రం గా  ప్రారంభించబడి ఆకలి కారణం గా ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదు అనే ఉన్నత లక్ష్యం తో ప్రారంభించారని, నగరం లో  ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం  మధ్యాహ్న భోజన పథకం (ఎం డి ఎం)లో భాగంగా  నాణ్యమైన రుచికరమైన వేడి ఆహారాన్ని  అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్న అతిపెద్ద సంస్థ ఇదేనని అన్నారు.

కేంద్రీకృతంగా ఏర్పాటు చేయబడిన వంటశాలలో  వండడం ద్వారా లక్షలాదిమంది పిల్లలకు భోజనాన్ని అందిస్తున్నారని,  గంటలో 40 వేల చపాతీ లను తయారు చేసే యంత్ర సామాగ్రి వీరి వద్ద ఉందని ఆన్నారు. భారతదేశంలో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో  ఉన్న 22 వేల ప్రభుత్వ పాఠశాలల్లో  సుమారు ప్రతిరోజు 20 లక్షల పైచిలుకు విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం  ఆయా రాష్ట్రాల సహకారంతో  నడుస్తున్నాయని, ఒక సంఘటన లో వీధి కుక్కలు పిల్లలు ఆహారం కోసం కోట్లాడుకోవడం చూసి చలించిపోయి ఈ సంస్థకు అంకురార్పణ చేయడం జరిగిందని అన్నారు.

ఎలాంటి లాభాపేక్ష లేకుండా  అవసరార్థులకు ఆహారాన్ని అందించడంతోపాటు కృష్ణ భక్తిని పిల్లలలో నింపడానికి  సంకల్పించడం వారి దార్శనికత కు  నిదర్శనం అని హరే రామ హరే కృష్ణ అంటే  తెలియని వారు ఉండరని అన్నారు. చాలామంది విదేశీయులు ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తారని, ఈ ప్రాంతంలో కిచెన్ యంత్ర సామాగ్రి ఏర్పాటు కు సహకారం అందించిన హెచ్ డి బి  యాజమాన్యాన్ని  ఈ సందర్భం గా మంత్రి అభినందించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు  హైదరాబాద్ లో కిచెన్ ఏర్పాటు కు స్థలం అడిగిన నేపధ్యంలో 2 ఎకరాలు కేటాయించడం జరిగిందని ఇలాంటి మంచి కార్యక్రమాల కోసం ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని,

ఇట్టి ఏర్పాటు కు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక శాసన సభ్యులు, మేయర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ  సెంట్రలైజ్డ్ హైజినిక్ అధునాతన వంటశాలను ఏర్పాటుచేసి ఆహారాన్ని అందించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపారని  పౌష్టికాహారం తో కూడిన ఆహారాన్ని ఇవ్వాలనే సంకల్పంతో కిచెన్ ను ఏర్పాటు చేయడం సంతోషం గా ఉందని మిల్లెట్స్ తో పాటు పిల్లందరికి ఆహారాన్ని అందించడానికి శ్రీకారం చుట్టారని,

అన్నపూర్ణ పథకం కింద నిరు పేద వర్గాలకు  గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్  పరిధిలో స్థానిక శాసనసభ్యుల ఆదేశం మేరకు అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని  మార్కెట్ అవసరాల కోసం అనేకమంది పేద రైతులు వస్తుంటారని వారికి ఆహారాన్ని అందించాలని ఉద్దేశంతో ఈ ప్రాంతంలో రూ. 5 భోజనాన్ని అందించడానికి అన్నపూర్ణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని స్లం ప్రాంతాలు, రైల్వే స్టేషన్ లు బస్ స్టాండ్ లు కోర్టు ఆవరణ జడ్ పి కార్యాలయ ప్రాంతాల్లో అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేశామని మేయర్ తెలిపారు. వర్డన్నపేట శాసన సభ్యులు కెఆర్ నాగరాజు మాట్లాడుతూ  మానవసేవయే మాధవసేవ అనే  విధంగా అక్షయ ఫౌండేషన్ వారు పనిచేస్తున్నారు.