calender_icon.png 23 December, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం: సర్పంచ్ నారపాక వసంత దానయ్య

22-12-2025 11:06:18 PM

సర్పంచి ఉప సర్పంచి పాలకవర్గం ప్రమాణ స్వీకారం

చండూరు,(విజయ్క్రాంతి):  గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామనినేర్మ ట సర్పంచ్ నారాపాక వసంత ధనయ్య అన్నారు. సోమవారం చండూరు మండల పరిధిలోనినేర్మ ట గ్రామంలో సోమవారం రోజున నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచి నారపాక వసంత దానయ్య, ఉపసర్పంచి నందికొండ మమతారెడ్డి వార్డ్ మెంబర్లతో ప్రత్యేక అధికారి చంద్రికప్రమాణ స్వీకారం  చేయించారు. 

ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమ పనులు  చేసి గ్రామాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతమని, గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గ్రామ సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి కృషి చేస్తామన్నారు. అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్ కి వార్డు మెంబర్లకు శాలువాతో గ్రామ ప్రజలు, ఘనంగా సన్మానించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.