22-12-2025 11:24:08 PM
* నాగ్సాన్ పల్లిలో భారాస వార్డు సభ్యుల డిమాండ్
* ప్రమాణ స్వీకారంలో పాల్గొనని వార్డు సభ్యులు
* ఎంపీవోకు వినతి పత్రం అందజేత
విజయక్రాంతి,పాపన్నపేట: నాగ్సాన్ పల్లి గ్రామ పంచాయతీ భవనానికి రాజకీయ పార్టీ పోలిక ఉండే రంగులు వేశారని, వెంటనే ఆ రంగులు మార్చాలని భారాస మద్దతుతో గెలుపొందిన వార్డు సభ్యులు, భారాస నాయకులు ఆరోపించారు. ఇదే విషయమై సోమవారం ఎంపీఓ శ్రీశైలంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు, భారాస నాయకులు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ భవనానికి రాజకీయ పార్టీ పోలిక ఉండే రంగులు వేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాము సోమవారం పాలకవర్గ ప్రమాణ స్వీకారం సైతం చేయలేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రంగులు మార్చాలని డిమాండ్ చేశారు. వార్డు సభ్యులు నాగమణి, శ్రీనివాస్, రాజ్ కుమార్, శ్రేయ, భారాస గ్రామ కమిటీ అధ్యక్షుడు శేకులు, నాయకులు శ్రీనివాస్, సామెల్, తదితరులున్నారు.