06-12-2025 12:00:00 AM
ఘట్ కేసర్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): వెంకటాపూర్ అనురాగ్ విశ్వవిద్యాలయం నందు వి.ఎల్.ఎస్.ఐ. నందు ఈసీఈ విభాగం వి.ఎల్.ఎస్.ఐ క్లబ్, ఐఈఈఈ స్టూడెంట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో వి.ఎల్.ఎస్.ఐ రంగంలో కృత్రిమ మేధస్సు ఉపయోగం అనే అంశంపై శుక్రవారం నిపుణుల చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణ కమతం ప్రారంభించారు.
ఈకార్యక్రమానికి అమెరికా నుండి ఎన్విడియా పరిశ్రమ నందు సీనియర్ హార్డ్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీధర్ గుడల, ముఖ్యఅతిథిగా పాల్గొని ఈసిఈ విద్యార్థులకు వి.ఎల్.ఎస్.ఐ నందు కృత్రిమ మేధస్సు ఉపయోగం, భవిష్యత్తు నందు కృత్రిమ మేధస్సును ఉపయోగించుకుని అభివృద్ధి చెందుతున్న వి.ఎల్.ఎస్.ఐ ఉత్పాదనలు గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం నందు ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణ కమతం, డాక్టర్ ఎం. సంతోష్ అసోసియేట్ డైరెక్టర్ ఓ.ఐ.ఏ, డా.పి. రామకృష్ణ, డాక్టర్ ఎస్. అమృత, విద్యార్థి సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.