06-12-2025 12:00:00 AM
డెక్కన్ సిరాయ్ హోటల్‌లో ‘నవరత్న ఎకో ప్రొడక్ట్స్’
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నా యంగా సహజసిద్ధమైన బయోపాలిమర్ పరిష్కరాలను అందించేందుకు నవరత్న ఎకో ప్రొడకట్స్ తమ బ్రాండ్ కంపోస్టిబుల్ ఉత్పత్తులను హైటెక్ సిటీలోని డెక్కన్ సిరా య్ హోటల్ వేదికగా ఆవిష్కరించింది. ఈ ఐసీఫ్‌ఎస్‌ఐ గ్రూప్ బ్రాండింగ్ డైరెక్టర్ కె. సుధాకర్‌రావు హాజరయ్యారు. ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్‌కుమార్, డీఆర్డీవో శాస్త్రవేత్త డా.వీరబ్రహ్మం, శ్రీరామ్ స్కూల్స్ ఎడ్యు కేష న్ డైరెక్టర్ డా. జ్యోతిరెడ్డి, కౌవే తెలంగాణ అ ధ్యక్షురాలు కల్పనా రావు, ధృమతారు కన్సల్టెంట్స్ సీఈఓ చేతనా జైన్ పాల్గొన్నారు.
సంస్థ సహవ్యవస్థాపకురాలు, సీఈఓ వంగారి గీత మాట్లాడుతూ.. కంపోస్టిబుల్ భూమికి భారమయ్యే ప్లాస్టిక్ ఉత్పత్తులకు శాశ్వత ప్రత్యామ్నాయమై, సహజంగా పూర్తిగా కరిగిపోయే పర్యావరణహిత ఉత్పత్తుల శ్రేణి. ఈ శ్రేణిలో డస్ట్బిన్ లైనర్లు, సువాసనగల డస్ట్బిన్ లైనర్లు, గిఫ్ట్ బ్యాగులు, పూజా బ్యాగులు వంటి గృ హ అవసరాలకు అనువైన ఉత్పత్తులు ఉన్నాయి. సుస్థిర త భారంగా కాకుండా సహజమైన జీవనశైలిగామారాలన్నదే మా సంకల్పం అన్నారు.