calender_icon.png 6 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎస్ పరిధిలో సమస్యలు పరిష్కరించాలి

06-12-2025 12:00:00 AM

సీఐ అప్పలనాయుడు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ అప్పలనా యుడు.. శుక్రవారం జీహెఎంసీ డిప్యూ టీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డితో పాటు టీటీయూసీ రాష్ర్ట అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డిని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశా రు. స్టేషన్ పరిధిలో రోడ్ల దుస్థితి, వీధి దీపాల సమస్యలు, చెట్ల కొమ్మల నరికివేత, పారిశుధ్య లోపాలను సీఐ వివరించారు.

పహరిగూడ ప్రాంతంలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. స్పందించిన డిప్యూటీ మేయర్.. ఓయూ పీఎస్ పరిధిలోని అన్ని కీలక ప్రాంతాలను కవర్ చేసేలా కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.