07-10-2025 01:23:16 AM
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): అగ్రికల్చర్ యూనివర్సి టీలో ఈ విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పీజీ (రెగ్యులర్ ,ప్రత్యేక కోటా), పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ విద్యాసాగర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్ లైన్‌లో ఈ నెల 12 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దాఖలు చేసుకోవచ్చని వెల్లడించారు. అభ్యర్థుల వినతి మేరకు ఈ నెల 6 వ తేదీ వరకు ఉన్న దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్సులకు సంబందించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయం వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.