22-12-2025 12:00:00 AM
బూర్గంపాడు,డిసెంబర్21(విజయక్రాంతి): మండల పరిధిలోని సారపాక ప్రధా న కూడలి నందు ఎస్‌ఐ మేడ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం వాహనాల తనిఖీలు ము మ్మరం నిర్వహించారు. ఈ సందర్భంగా స రైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. ద్విచక్ర వాహనాల పై త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని, పరిమితికి మించిన వే గంతో వెళ్లవద్దని సూచించారు. రహదారి పై వస్తున్న ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి, వాహనదారుల లైసెన్స్ లను పరిశీలించారు. వారికి జరిమానాతో పాటు శాఖపరమైన చర్యలు తప్పవని ఎస్‌ఐ సూ చించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్‌ఐ నాగభిక్షం,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.