calender_icon.png 22 December, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారులో చెలరేగిన మంటలు.. క్షణాల్లో కాలిబూడిదైన వైనం..

22-12-2025 12:00:00 AM

టేకులపల్లి, డిసెంబర్ 21,(విజయక్రాంతి): పాల్వంచ పట్టణానికి చెందిన ప్రభు త్వ ఉపాధ్యాయుడు లకావత్ కిషన్ తన భార్య లక్ష్మితో కలిసి తన కారులో డోర్నకల్ మండలం గోవింద్ రాలలో జరిగే ఇరుముడి కార్యక్రమానికి ఆదివారం బయలుదే రాడు. టేకులపల్లి - కొత్తగూడెం జాతీయ రహదారిలోని కారుకొండ క్రాస్ రోడ్డు తర్వాత బ్రిడ్జి దాటగానే ఏసీలో పొగలు రావడం గమనించి కారు ఆపి దిగిపోయారు. అకస్మాత్తుగా మంటలు అంటుకొని కారు క్షణాల్లోనే ఆ మంటల్లో దగ్ధమైంది. తర్వాత ఫైర్ ఇంజ న్ వచ్చి మంటలను ఆర్పి వేసినప్పటికీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. బాధితుల టేకులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.