07-11-2025 01:03:40 AM
హాజరు కానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
యూనివర్సిటీలో నిర్వహణ లోపం
వేధిస్తున్న టీచింగ్‌స్టాఫ్‌కొరత
కరీంనగర్, నవంబర్ 6 (విజయ క్రాంతి): ఈనెల 7న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాతవాహన యూనివర్సిటీ రెండవ స్నాత్సకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకాను న్నారు. . మరో అతిథి గా ప్రొఫెసర్ బీ. జే రావు హాజరుకానున్నారు. కులపతి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కు స్వాగతం పలుకుతున్నాయి.కరీంనగర్ ఉమ్మడి జిల్లా కు గర్వకారణంగా స్థాపించబడిన శాతవాహన యూ నివర్సిటీ ప్రస్తుతం సమస్యలతో కొట్టు మిట్టాడుతుంది.
టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది కొరత, భవనాల సమస్యలు, నిధుల కొరత వంటి అనేక అంశాలు కులపతి ముందు ఉన్నాయి. పేరుకు యూని వర్సిటీ అయినా, నిర్వహణ లోపం కారణంగా శాతవాహన యూనివర్సిటీ లో టీచింగ్ స్టాఫ్ కొరత తీ వ్రంగా ఉంది. 2024 అక్టోబర్ నెలలో కొత్తగా ఉప కులపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ ఈ విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఇంజనీరింగ్ కాలేజీ, లా కాలేజ్, ఎం ఫార్మసీ, ఎంసీఏ వంటి కొత్త కోర్సులను తీసుకురావడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము చొరవతో కాలేజీల మంజూరు జరిగింది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన పోస్టులను మంజూరు చేయకపోవడం వల్ల కొత్త కాలేజీలు కోర్సులు గెస్ట్ ఫ్యాకల్టీ బోధన మీదనే విశ్వవిద్యాలయం ఆధార పడాల్సి వస్తుంది. దీనివల్ల కోర్సుల నడక అనేటువంటిది పురోగమి దిశలో ఉంటుందనేది సందేహ స్థితి. అంతేకాకుండా విశ్వవిద్యాలయం పై ఆర్థిక భారం మరింతగా పడుతుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సింది ఉంది.
ఇంకా అంతర్గత అభివృద్ధి చాలావరకు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. బాటనీ, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో నడుస్తున్నాయి. విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించి చదవాల్సిన పరిస్థితి ఉంది. వీటికి ప్రభుత్వం టీచింగ్ పోస్టులను సాంక్షన్ చేయకపోవడంతో, కాంట్రాక్ట్ లేదా పార్ట్టైమ్ లెక్చరర్లతోనే బోధన కొనసాగుతోంది.
ఎకనామిక్స్లో ఇద్దరే రెగ్యులర్ ఫ్యాకల్టీ, ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి,బాటనీ, మ్యాథ్స్లో ఒక్కో విభాగానికి ఇద్దరేసి మాత్రమే ఉన్నారు.తెలుగు విభాగంలో ఇద్దరు, ఇంగ్లీష్లో ముగ్గురు టీచింగ్ స్టాఫ్ మాత్రమే పనిచేస్తున్నారు. ప్రొఫెసర్ పోస్టులు 10 మంజూరవగా 8 ఖా ళీగా ఉండటం, అసోసియేట్ ప్రొఫెసర్ 16 లో 10 ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 37 లో 27 ఖాళీలు ఉండటం యూనివర్సిటీ పరిస్థితిని అద్దం పడుతోంది. .
మాజీ వీసీలు ప్రొ ఫెసర్ ఇక్బాల్‌అలీ, ప్రొఫెసర్ వీరారెడ్డి కొత్త కోర్సుల ప్రతిపాదనలు పంపినా కొన్ని మా త్రమే మంజూరు అయినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశలు ఉండే, ఈ ప్రభుత్వంలా, ఇంజనీరింగ్ కళాశాలలను ఏ ర్పాటు చేసింది కానీ పూర్తి స్థాయి బోధన, బోధనేతర సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. 2019లో ఇన్ఛార్జి వీసీ చిరంజీవులు, రిజిస్ట్రా ర్గా ప్రస్తుత వి సి ఉమేశ్కుమార్ ఉన్న సమయంలో యూనివర్సిటీ చరిత్రలో తొలిసారి కాన్వొకేషన్ నిర్వహించి విద్యార్థులకు పట్టా లు పంపిణీ చేశారు.
ఆ తర్వాతి అరేళ్లకు రెం డవ కాన్వొకేషన్ నిర్వహిస్తున్నారు. సమస్యల పై కులపతి దృష్టి సారించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.యూనివర్సిటీ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన ప్రస్తుత మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఇప్పుడు రాష్ట్ర మంత్రులుగా ఉన్న నేపథ్యంలో, ఈ యూనివర్సిటీ పునరుజ్జీవనానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
విద్యార్థులు డిమాండ్ దృష్ట్యా కొత్త కోర్సులు రావలసి ఉంది
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం లో మాజీ ఉప కులపతి ప్రొఫెసర్ మల్లేష్ పరిపాలనా కాలంలో జరిగిన అనేక అవినీతి, అక్రమాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్న నేపద్యంలో దీనిపై ప్రభుత్వము మరియు గవర్నర్ దృష్టి సారించాల్సి ఉందని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి-
ఖాళీగా ఉన్న టీచింగ్ _నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయాలి. యూనివర్సిటీ కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్తులు ఇబ్బంది పడు తున్నారు. తెలుగు ఇంగ్లీష్ బోటనీ మ్యా థమెటిక్స్ ఫుడ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ నిండు రెగ్యులర్ కోర్సులు చేయాలి ఇటీవల మంజూ రైన లా ఇంజనీరింగ్ ఎం ఫార్మసీ కళాశాలల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ నియమించా లి దాని ద్వారా విద్యా ప్రమాణాలు పె రుగుతాయి యూనివర్సిటీ పరిధిలో క్రీడలకు సంబంధించి ఇండోర్ ఔట్ డోర్ స్టేడియలునిర్మించాలి.
- మనికంట రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్, రాష్ట్ర అధ్యక్షులు