calender_icon.png 17 December, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్కు పిండి వసూళ్లు!?

17-12-2025 12:00:00 AM

  1. వేర్ హౌస్ల వద్ద బియ్యం లారీల పడిగాపులు 

20 ఏళ్లుగా తిష్ట వేసిన అధికారులు

అగచాట్లకు గురవుతున్న మిల్లర్లు

నిజామాబాద్, డిసెంబర్ 16 (విజయ క్రాంతి): ధాన్యాన్ని ఆడించి బియ్యాన్ని వేర్ హౌస్ కు తరలిస్తున్న మిల్లర్లు తీవ్ర అగచాట్లకు గురవుతున్నారు. రోజుల తరబడి బియ్యంలోడుతో వేర్ హౌస్ ల ముందు లారీలు వందల సంఖ్యలో నిలబడి పోతుండ డంతో లారీలకు అద్దెతో పాటు వెయిటింగ్ చార్జెస్ చెల్లించలేక మిల్లర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు.  ఈ విషయమై మిల్లర్లు జిల్లా కలెక్టర్లను సాంప్రదించి నప్పటికిని జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను వేర్ హౌస్ గోడౌన్ల నిర్వహకులు ఖాతారూ చేయడం లేదు.  గత రాత్రి నుండి నగరంలోని వేర్ హౌస్ ల వద్ద వంద కు పైగా ధాన్యం లోడుతో లారీలు నిలబడి ఉన్నాయి.

ఒక్కో క్కా లారీ కు రోజుకు రూ :1000 చొప్పున లారీ కు వెయిటింగ్ చార్జెస్ చెల్లించడం వల్ల ప్రస్తుతం నిలబడి ఉన్న 100 లారీలకు గాను సరాసరి లక్ష రూపాయల వెయిటింగ్ చార్జ్ వారం మిల్లర్లపై పడుతోంది. ఈ వెయిటింగ్ ఐదు రోజులు మోదలుకొని 10,20,రోజుల వరకు లారీలు అన్లోడింగ్ కాక వేర్ హౌస్ ల వద్ద నిలబడి పోవడంతో వంద లారీలకు గాను దినసరి లక్ష రూపాయల వెయిటింగ్ మిల్లర్లు చెల్లించాల్సి వస్తోంది.

పైగా వందల సంఖ్యలో లారీలు నిలిచిపోవడంతో లారీల కృత్రిమ కొరత కూడా ఏర్పడు తోంది.  ఈ అదనపు చెల్లింపుల వల్ల మిల్లర్లు తీవ్రంగా నష్టపోతున్నారు.  గత సోమవారం తెల్లవారు జామువరకు నిజామాబాద్ జిల్లాలోని వివిధ వేర్ హౌస్ గోడౌన్ల వద్దా లారీలు వందల సంఖ్యలో నిలబడిపోయి ఉన్నాయి. శుభోదయ వేర్ హౌస్ వద్ద 61 లారీలు వర్ని వద్ద నాలుగు లారీలు ఏఎంసీ బోధన్ గోడౌన్ వద్ద 24 లారీలు ఏఎంసీ పెంట కలను వద్ద ఏడు లారీలు ఏఎంసి రెంజల్ వద్ద నాలుగు లారీలు మొత్తం కలిపి 100 లారీల వరకు సోమవారం వరకు సీఎంఆర్ రైస్ లోడుతో వేర్ హౌస్ గోడౌన్ లో వద్ద పడిగాపులు కాస్తున్నాయి.     

ఈ రైస్ మిల్ వ్యాపారము మిల్లర్ల పాలిట శాపంగా మారింది. 20 ఏళ్లుగా వేర్ హౌస్ గోడౌన్లలో తిష్ట వేసి ఉన్న అధికారులు. కొందరు బడా మిల్లర్ల బినామీలు అంతా కలిసి మిల్లర్లను ముప్పేట ముంచుతున్నారు. ఎంతో నిజాయితీగా రైస్ మిల్లు వ్యాపారం సాగించిన అప్పటికి ని అధికారుల జేబులు నింపకుండా ఉండలేని పరిస్థితి నెలకొందని మిల్లర్లు వాపోతున్నారు.

జిల్లాలో రెండు సీజన్లకు కలిపి ధాన్యం అధిక మొత్తంలో దిగుబడి వస్తున్నందున ధాన్యం ఆడించిన మిల్లర్లు బియ్యాన్ని వేర్హౌస్ గోడౌన్లకు తరలిస్తున్నారు హమాలీ టెండర్లు పొందినవారు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారము మిల్లర్ లు డబ్బులు చెల్లిస్తు న్నప్పటికీ అదనంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉప్పల్వాయిలో ఏడు రూపాయలు లోకేశ్వరంలో ఆరు రూపాయలు శుభోదయ లో నాలుగు రూపాయలు బస్తాకు అదనంగా వసూలు చేస్తున్నారు.

కొందరు బడా మిల్లర్లు బినామీ కాంట్రాక్టర్ ను ఏర్పాటు చేసుకుని మిల్లర్ల వద్ద నుండి దబాయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన మిల్లర్ల తాలూకు బియ్యం లోడు లారీలను రోజుల తరబడి వివిధ సాకులతో నిలిపేస్తున్నారు. బడా మిల్లర్లు ఏర్పాటు చేసుకున్న బినామీలు ఏళ్ళుగా తిట్టేసిన అధికారులు కుమ్మక్కయి మిల్లర్ల నుండి దబాయించి వస్తువులకు పాల్పడుతున్నారు.

వేర్హౌస్ అసోసియేషన్ బడా వ్యాపారులు బినామీ కాంట్రాక్టర్ల చేత నిర్వహిస్తున్న శుభోదయం వేరే లో ఒక్క ఏసీకే కు అదనంగా 2,350 లోకేశ్వరం వేర్ హౌస్ గోడౌన్ లో ఒక ఏసీకేకు 3,500 ఉప్పల్వాయి వేర్ హౌస్ లో ఏసీకేకు 4,000 రూపాయలు అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. బడా మిల్లర్లు అధికారులు కుమ్మక్కై పాల్పడుతున్న ఈ వసూళ్ల వల్ల మిల్లర్లపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.

ఈ అక్రమ వసూళ్లకు ముఖ్య కారణం గత 20 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి కీ కాంట్రాక్టు నిర్వహణ కలిగి ఉండడం తోపాటు గత 20 ఏళ్లుగా ఒకే అధికారి స్థానికంగా తిట్టేసి విధులు నిర్వర్తిస్తుండడం తో వీరి రెండు చేతుల అక్రమ సంపాదనకు అడ్డు లేకుండా పోయింది. వేర్ హౌస్ బినామీల అక్రమాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని మిల్లర్లు గుండెలు బాదుకుంటున్నప్పటికీ అధికారుల్లో చేరడం లేదు.

గత 20 ఏళ్లుగా ఒకే అధికారి వేర్ హౌస్ లో నిర్వహణ పర్యవేక్షిస్తూ ఉండడం గమనించదగ్గ విషయం. జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకొని ఈ అధికారిని బాధ్యతలు నుండి డి తప్పించి క్షణమే బదిలీ చేయించలని మిల్లర్ లు జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకుంటున్నారు. బియ్యం లోడ్ తో వస్తున్న లారీలు 25 రోజుల వరకు వెయిటింగ్ లో ఉండడం వల్ల అద్దెతో పాటు అదనంగా వేల రూపాయలు చెల్లించి తాము తీవ్రంగా నష్టపోతున్నామని మిల్లర్లు వాపోతున్నారు.

బియ్యం లోడును వేరే హౌస్ లో దింపడానికి మిల్లర్ ల హమాలీలు దింపుకున్నప్పుడు గోదామా హమాలీలకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వేర్హౌస్ గోడౌన్లలో మిల్లర్ల నుండి హమాలి రెండు రూపాయలు తగ్గించి మిగతా డబ్బులను బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని వేర్ హౌస్ గోడౌన్లలో ఒక్క ఏసీకే 6 రూపాయల ప్రభుత్వం తగ్గించగా మిగతా నాలుగు రూపాయలు చొప్పున ఒక్క ఏసీకే లాటిన్ సాకుతో శుభోదయ వేర్ హౌస్ రూ:2,320. ఉప్పల్వాయి వేర్ హౌస్ లో రూ:4.060, లోకేశ్వరం వేర్ హౌస్ లో రూ:3.360 రూపాయల చొప్పున బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ సంవత్సరాల తరబడి తిష్ట వేసి ఉన్న అధికారులను బదిలీ వెటు వేస్తూనే గాని మిల్లర్ల నుండి అక్రమ వసూళ్లకు స్థిరపడే అవకాశం ఉంది.