calender_icon.png 22 September, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి నిధులివ్వండి

22-09-2025 01:18:31 AM

-ప్రభుత్వానికి యూనివర్సిటీల ప్రతిపాదనలు

-బడ్జెట్‌లో కేటాయించిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి

-‘ఉస్మానియా’కు ప్రత్యేక నిధులు ఇస్తే మాకూ ఇవ్వాలంటున్న పలు వర్సిటీలు

-ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చాకే నిధులు విడుదల

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్‌లో యూనివర్సిటీలకు కేటాయించిన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయా యూనివర్సిటీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ మేరకు నిధుల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనలను పలు యూనివర్సిటీలు విద్యాశాఖకు సమర్పించాయి. మరికొన్ని యూనివర్సిటీలు ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి.

ఇప్పటి వరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించిన వాటిలో మూడు యూనివర్సిటీలున్నట్లు తెలిసింది. విద్యాశాఖ ఈ ప్రతిపాదనలను ఆర్థికశాఖకు పంపించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే, కేటాయించిన నిధులను వి డుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయా వర్సిటీలే ప్రతిపాదనలను స మర్పించడంలో ఆలస్యం చేస్తున్నట్లుగా సచివాలయ ఓ ఉన్నతాధికారిణి తెలిపారు. అం బేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు బడ్జెట్ నిధులను ఇప్పటికే విడుదల చేసినట్లు ఆ అధికారిణి పేర్కొన్నారు.

ఐదు నెలలుగా నిధుల్లేవ్ 

రాష్ట్ర బడ్జెట్‌లో పది యూనివర్సిటీలకు రూ.500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఉస్మానియా యూనివర్సిటీ, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలకు రూ.100 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకు రూ.50 కోట్లు, మహాత్మాగాంధీ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, శాతవాహన వర్సిటీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ, తెలంగాణ వర్సిటీలకు రూ.35 కోట్ల చొప్పున కేటాయిం చారు. ఇక అంబేద్కర్ వర్సిటీకు రూ.25 కోట్లను కేటాయించింది. ఈ నిధులను 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించారు. నిధులు కేటాయించి కూడా ఐదు నెలలు కావొస్తున్నాయి. కానీ,ఇంత వరకు సర్కారు నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం. 

మూడు వర్సిటీల నివేదికలే ఆర్థిక శాఖకు..

అయితే, ఉన్నత విద్యాలయాలకు కేటాయించిన నిధులను ఏ అవసరాలకు, ఏ విధంగా ఖర్చు చేస్తారనే దానిపై ఇప్పటికే ఆయా వర్సిటీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. తాజాగా, ఇప్పుడు నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని ఆయా వర్సిటీలకు విద్యాశాఖ కోరుతోంది.

ఇది తమ పనికాదని, వర్సిటీలే నిధుల విడుదలకు సంబంధించిన నివేదికలను ఈపాటికే సమర్పించాల్సి ఉండా ల్సిందని విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారిణి పేర్కొన్నారు. కానీ, వర్సిటీల అభివృద్ధికి నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని కోరినట్లు తెలిపారు. ఓ మూడు వర్సిటీల నివేదికలపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అప్రూవల్ చేస్తూ ఆర్థికశాఖకు సమర్పించినట్లు తెలిసింది. ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చాకే వర్సిటీలకు కేటాయించిన నిధులు విడుదల కానున్నట్లు తెలిసింది. 

మాకూ రూ.500 కోట్లు ఇవ్వాలి 

ఇదిలా ఉంటే ఆగస్టు నెలలో ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంహించారు.  వర్సి టీ అభివృద్ధికి అవసరమైతే రూ. 1000 కోట్లునా కేటాయిస్తామని ఆ సందర్భంగా సీఎం ప్రకటించిన విష యం తెలిసిందే. ఈ క్రమంలోనే మి గతా వర్సిటీలు కూడా ఎంతో కొంత నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా యి. ఉస్మానియాకు రూ.1000 కోట్లు కేటాయిస్తామనడంతో కాకతీయ వర్సిటీకు రూ.500 కోట్లునా కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఇదే బాటలో మరికొన్ని వర్సి టీలు కూడా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మిగతా వర్సిటీలకు కూడా రూ.100 కోట్ల నుంచి రూ .200 కోట్లనైనా ఈ ఏడాదిలో కేటాయించాలని వీసీలు కోరుతున్నట్లు సమాచారం.