calender_icon.png 7 September, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి కంటి శాస్త్ర చికిత్స శిబిరం ద్వారా 200 మందికి కంటి ఆపరేషన్లు

04-09-2025 11:05:14 PM

భద్రాద్రి నుండి పుష్పగిరి కంటి ఆసుపత్రికి ఆపరేషన్ల కొరకు 5వ బ్యాచ్ పేషెంట్ల తరలింపు

ప్రారంభించిన లైన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ కురిచేటి శ్రీనివాస్..

భద్రాచలం (విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ భద్రాచలం, లయన్స్ క్లబ్ జటావు, వికాస తరంగిణి, ఎన్.ఆర్.ఐ. వాసవి అసోసియేషన్ యుఎస్ఏ వార్ల అధ్వర్యంలో 'పుష్పగిరి కంటి అసుపత్రి(Pushpagiri Eye Hospital)' సికింద్రాబాద్ బృందం నిర్వహించిన ఉచిత నేత్ర శస్త్ర చికిత్స శిబిరములు విజయవంతమైనవి, ఇందులో భాగంగా గురువారం 5వ బ్యాచ్లో భాగంగా 41 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు సికింద్రాబాద్ పుష్పగిరి కంటి ఆసుపత్రికి తరలించే కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ భద్రాచలం జోన్ చైర్మన్ కురిచేటి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కురిచేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కంటి ఆపరేషన్లకు సికింద్రాబాద్ వెళ్తున్న వారు మంచి కంటి చూపుతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ శిబిరంలో డా.ఎస్.ఎల్. కాంతారావు డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్ మాట్లాడుతూ, అంధత్వ నివారణ కార్యక్రమం 1984 సంవత్సరంలో శ్రీకురిచేటి శ్రీనివాసరావు తండ్రి లేట్ శ్రీకురిచేటి పాండురంగారావు భద్రాచలంలో ప్రారంభించినారని, నాటి నుండి నేటి వరకు వేలాది మంది పేద ప్రజలకు కంటి ఆపరేషన్లు లయన్స్ క్లబ్, ఆవోపా ద్వారా నిర్వహించడం జరిగిందని, వారి సేవలను అభినందించినారు.

తండ్రి మాదిరిగానే కురిచేటి శ్రీనివాసరావు సైతం సేవలు అందిస్తున్నారని, మున్ముందు ఎక్కువ కార్యక్రమాలు చేపట్టాలని కోరినారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ప్రాజెక్టు ఆఫీసర్ ఐటిడిఎ భద్రాచలం బి.రాహుల్  సహాయ సహకారాలతో ఈ శిబిరములు నిర్వహించగలుగుతున్నామని, వారికి ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో 600 మంది కంటి ఆపరేషన్లకు ఎంపికైనారని, ప్రతి బ్యాచ్లో 41 మంది చొప్పున 15 బ్యాచ్లుగా కంటి ఆపరేషన్ల కొరకు హైదరాబాద్లోని పుష్పగిరి కంటి ఆసుపత్రికి తరలించు కార్యక్రమం చేపడుతూ నేడు 5వ బ్యాచ్గా 41 మందిని ఆపరేషన్ నిమిత్తం పుష్పగిరి కంటి ఆసుపత్రికి సికింద్రాబాద్కు తరలించామని, ఇప్పటి వరకు 200 మందికి కంటి ఆపరేషన్లు పూర్తి అవుతాయని డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు తెలిపినారు. ఈ కార్యక్రమంలో  లైన్స్ క్లబ్ నాయకులు లయన్, వై. సూర్యనారాయణ, లయన్. శ్రీమతి కమలా రాజశేఖర్, లయన్, నక్కా వెంకన్న, లయన్ యం. సిద్ధారెడ్డి, జి. రాజారెడ్డి, జి. సంజీవరావు, ఆదినారాయణ, మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది  పాల్గొన్నారు.