calender_icon.png 25 November, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ యూనివర్సిటీలో ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్

25-11-2025 12:05:28 AM

ఘట్ కేసర్, నవంబర్ 24 (విజయక్రాంతి): వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో  నిర్వహించిన ఫ్రంటియర్స్ ఆఫ్ నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంతర్జాతీయ అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈకార్యక్రమం విజయవంతం కావడానికి ఐటీ విభాగాధిపతి డాక్టర్ నితీషాశర్మ యొక్క సహకారం, మార్గదర్శనం అత్యంత ముఖ్యంగా నిలిచింది.

ఐదు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ నిపుణులు, పరిశోధకులు పాల్గొని నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెసింగ్ రంగంలోని తాజా పరిశోధనలు, సాంకేతికతలపై తమ అమూల్యమైన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని డీప్ లెర్నింగ్ మోడల్స్, లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్, మెషీన్ ట్రాన్స్లేషన్, స్పీచ్ ప్రాసెసింగ్, టెకస్ట్ అనాలిటిక్స్ వంటి వివిధ అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించబడ్డాయి.

170 మంది అధ్యాపకులు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తాజా ట్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భాషా నమూనాలు, పరిశోధనా అవకాశాలపై విస్తృతంగా అవగాహన పొందారు. కార్యక్రమం అంతటా పాల్గొన్న వారిలో మంచి ఉత్సాహం కనిపించిందని నిర్వాహకులు తెలిపారు.