calender_icon.png 25 November, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపద లూటీపై శ్వేతపత్రమేదీ?

25-11-2025 12:03:29 AM

దుప్పటి మొగిలి :

సహజ సంపదల విషయంలో భారత్ ప్రపంచంలోని అగ్ర దేశా ల్లో ఒకటిగా ఉంది. అడవులు, గుట్టలు, నదులు, ఖనిజాలు, గ్రానైట్, బొగ్గు, ఇను ము, బాక్సుటై, బంగారంతో ఒకప్పుడు ధన సంపద దేశంగా విరాజిల్లింది. ఈ సంపదలు రాజ్యాంగం ప్రకారం జనరల్ పబ్లిక్ ట్రస్ట్ అంటే ప్రజల సొత్తు. ప్రజల ఆస్తిని ప్రభుత్వం కాపాడాలి, ప్రజల ప్రయోజనా నికి ఉపయోగించాలి. కానీ స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తర్వాత చరిత్ర చూస్తే, ఈ సహజ సంపదలు నిజంగా ఎవరికీ ఉప యోగపడ్డాయన్న ప్రశ్న తలెత్తుతుంది.

ప్రజల సంపద నాయకుల ఇష్టులైన కొంత మందికి మాత్రమే చేరగా, ప్రజలకు వచ్చి న లాభం తక్కువే. స్వతంత్రం తర్వాత  స హజ సంపదలు ప్రధానంగా ప్రభుత్వ రం గ సంస్థలుగా ఉన్నాయి. కోల్ ఇండియా, సింగరేణి, ఎన్‌ఎండీసీ వంటి సంస్థలు ప్రజల ఆస్తిని ప్రజల కోసమే వినియోగిం చాయి.

రాష్ర్ట ప్రభుత్వాలు కూడా గుట్టలు, అడవులు, గ్రానైట్, లైమ్ స్టోన్ వంటి వన రులను పరిమిత హక్కులతో మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేవి. కానీ 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత పరిస్థితి పూర్తిగా మా రిపోయింది. లిబరలైజేషన్ పేరుతో సహ జ సంపదలపై ప్రైవేటు కంపెనీలు భారీ స్థాయిలో అడుగుపెట్టాయి. ఇది దేశ ఆర్థిక శక్తిని పెంచుతుందనే ఉద్దేశ్యంతో ప్రజల ఆస్తిని కొద్ది మంది వ్యాపార వర్గాల చేతుల్లోకి నెట్టివేయబడింది.

ప్రైవేటు చేతుల్లోకి!

1993లో మొదటిసారి బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలకు క్యాప్టీవ్ మీనింగ్ రూ పంలో ఇవ్వడం ప్రారంభమైంది. 1999-2004 మధ్య చమురు, గ్యాస్ బ్లాకులు ఎన్‌ఈఎల్పీ (NELP) విధానం ద్వారా ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారు. 2003-2008 మధ్య ఇనుము, బాక్సుటై, మాంగనీస్, లైమ్ స్టోన్, గ్రానైట్ లాంటి ఖ నిజాల లీజులు వందల సంఖ్యలో ప్రైవేటు చేతుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వానికి వచ్చిన లాభం రాయల్టీల రూపంలో స్వల్పమే, కానీ కంపెనీలు మార్కెట్ ధరలతో వందల రెట్లు సంపాదించాయి.

ప్రభుత్వం సహజ సంపదలపై ఇచ్చే లీజులతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తక్కువ.  బొగ్గు టన్నుకు కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీ 150 నుంచి 250 రూపాయల మధ్యే ఉంది. అదే బొగ్గును మార్కెట్లో నా లుగు నుంచి ఆరు వేలుకు అమ్ముకుంటా రు. ఇనుము ఖనిజంపై రాయల్టీ 10 నుం చి 15 శాతం మాత్రమే. గ్రానైట్ విషయం లో రాష్ర్ట ప్రభుత్వాలు క్యూబిక్ మీటర్‌కు ఒకటి నుంచి మూడువేల వరకు మాత్రమే తీసుకుంటాయి.

కానీ అదే రాయి విదేశాల కు వెళ్లినప్పుడు ధర లక్ష రూపాయల వర కు ఉంటుంది. 1990-2024 మధ్య ప్రభుత్వం సంపాదించిన సహజ సంపద ఆదాయం దాదాపు 3.5 లక్షల కోట్లు మా త్రమే ఉంటే, అదే సమయంలో ప్రైవేటు సంస్థల లాభం మాత్రం 25 నుంచి 30 లక్షల కోట్లు దాటడం గమనార్హం. 

పర్యావరణానికి దెబ్బ..

సహజ సంపదల దోపిడీ వల్ల భారత దేశం పర్యావరణం తీవ్రంగా దెబ్బతింది. 30 సంవత్సరాల్లో సుమారు 13 లక్షల హె క్టార్ల అరణ్యాలు గనులు, రహదారులు, ప్రైవేటు అభివృద్ధి పేరుతో నాశనమయ్యా యి. ఇందులో అధిక భాగం అటవీ, గిరిజ న ప్రాంతాలదే. అడవులు తగ్గడంతో వన్య ప్రాణులు అదృశ్యమయ్యాయి. వాతావర ణ మార్పులు వేగవంతమయి స్థానిక జలాశయాలు ఎండిపోతున్నాయి. పర్యావ రణ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది.

ఇవన్నీ రాబోయే తరాలకు తీవ్రమైన హెచ్చ రికలు. నదుల్లో ఇసుక మాఫియా పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు నిర్వహించడం వల్ల  వేసవిలో నదులు త్వరగా ఎండిపో తూ అనేక గ్రామాలకు త్రాగునీరు సమస్య గా మారుతుంది. నదుల్లో చేపలు తగ్గిపోవ డం వల్ల వేలాది కుటుంబాలకు జీవనోపా ధి కరువయ్యింది. ఇసుక తవ్వకాలు అనేక రాజకీయ నేతల ఆధీనంలో ఉండడం వల్ల ఇసుక మాఫియా రాజకీయ సంరక్షణతో నడుస్తుండటంతో, చర్యలు తీసుకోవ డంలో ప్రభుత్వం వెనుకంజ వేసిన సంద ర్భాలు కోకొల్లలు.

ఇది ప్రజల జీవనోపా ధిని ప్రభావితం చేసింది. ముఖ్యంగా గిరిజ న ప్రాంతాలు సహజ సంపదల దోపిడీకి గురయ్యాయి. భారత్‌లో గనుల తవ్వకం కారణంగా 50 లక్షలకు పైగా గిరిజనులు తమ భూములు కోల్పోయి గ్రామాలు విడిచి వెళ్లాల్సి వచ్చింది. వారిలో చాలా మందికి సరైన పరిహారం, పునరావాసం ఇప్పటికీ అందలేదు. అడవులు నాశనం కావడంతో గిరిజనుల జీవన విధానం, ప్రమాదం లో పడ్డాయి. ఇది మానవతా సంక్షోభం కిందకే వస్తుంది.

తెలంగాణలోనూ దోపిడీ..

ఇక భారత్‌లో  తెలంగాణ ప్రాంతం విస్తారమైన సహజసంపదలు ఉన్న రా ష్ర్టం. ముఖ్యంగా గ్రానైట్, బొగ్గు, లైమ్ స్టో న్, ఇసుక, అడవులు, రాతిబండ గుట్టలు ఈ ప్రాంతానికి గొప్ప సంపద. కానీ తెలం గాణ సహజ సంపదలు కూడా దాదాపు దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే దోపిడీకి గురయ్యాయి. గ్రానైట్ ఒక్క దానితోనే గత 25 సంవత్సరాల్లో కనీసం 2.5 లక్షల కోట్లు విలువైన రాళ్లు ఎగుమతి అయినట్లు అంచ నా. ప్రభుత్వ రేటు మాత్రం ఒక్క క్యూబిక్ మీటర్‌కు 3 వేల రూపాయల లోపే ఉం టుంది.

కానీ అదే గ్రానైట్ అమెరికా, చైనా, జపాన్, రష్యా మార్కెట్లలో 8వేల నుంచి 1.5 లక్షల వరకు అమ్మబడుతుంది. దీన్నిబ ట్టి కంపెనీల లాభం 50 నుంచి 70 రెట్లు అధికమని చెప్పొచ్చు. ప్రభుత్వ ఖజానాకు వస్తున్న మొత్తం 5 లేదా 6 వేల కోట్ల వర కు ఉండగా.. మిగతాది ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తమవుతుంది. ఈ చర్యల వల్ల పర్యావరణం, ప్రజలకు నష్టమే ఎక్కువగా ఉంటుంది. ప్రజల సొత్తు కొందరినే ధన వంతులుగా చేసింది.

తెలంగాణలో హైద రాబాద్  చుట్టూ రాతిబండ గుట్టలు నగర పర్యావరణానికి జీవకళ. కానీ గండిపేట్, నాగోలు, రాజేంద్రనగర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో రాతి బండలు పూర్తిగా తొల గించబడ్డాయి. దీనివల్లే హైదరాబాదులో ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగింది. నగరంలో వరదలు పెరిగి శిలావనాలు పోవడంతో పక్షులు, వన్యజీ వులు అదృశ్యమయ్యాయి.

సింగరేణి ప్రాంతాల్లో సహజ సంపదల దోపిడీతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింది. భూగ ర్భ గనుల కారణంగా స్థలాలు కుంచిం చుకుపోవడం, గోదావరి ఉపనదులు కా లుష్యం, పర్యావరణంలో కార్బన్ పెరుగు దల, గిరిజనుల నిర్వాసనం వంటి సమస్య లు ఉన్నాయి. సింగరేణి లాభాలు ప్రభు త్వానికి వస్తుంటే నష్ట ఫలాలు మాత్రం స్థానికులకు దక్కుతున్నాయి. 

ఎవరికెంత లాభం?

సహజ సంపదలు ప్రజల సొత్తు. 1947 నుంచి నేటి వరకు ఇచ్చిన అన్ని లీజులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరముంది. ఆ శ్వేతపత్రంలో ఏ సం వత్సరంలో ఎన్ని లీజులు ఇచ్చారు? ఎవరి కిచ్చారు? లీజు రేటు ఎంత? ఎంతకాలం ఇచ్చారు? కంపెనీలు నిజంగా ఎంత సం పాదించాయి? ప్రభుత్వానికి వచ్చిన వాస్త వ ఆదాయమెంత? నష్టపోయిన సహజ సంపదెంత? గిరిజనులు ఎంత మంది నిర్వాసితులయ్యారు? నదులు, పర్వతాలు ఎంత మేరకు నాశనమయ్యాయి? భూగ ర్భ జలాలు ఏ స్థాయిలో పడిపోయాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా అభివృద్ధి నిండుగా ఉందని ప్రభుత్వాలు చెప్పడం అబద్దమే అవుతుంది.

సహజ సంపదలు  రక్షించవలసిన ప్రభుత్వాలు.. అదే సంపదను  లీజులు, అభివృద్ధి, అమ్మ కాల పేరుతో కంపెనీలకు అప్పజెప్పడం పర్యావరణానికి నష్టం కలిగించడం కిందకే వస్తుంది. ఇది రాబోయే తరాలకు పెను ప్ర మాదాన్ని ఏర్పరుస్తుంది. ఇప్పటికైనా  కేం ద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సహజ సంపదలపై పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయడం అత్యవసరం. దీనివల్ల అసలు సహజ సంపద ఎవరికీ లాభం తెచ్చిపెట్టిందో తెలుస్తుంది. అంతేగాక ఏ ప్రభుత్వాలు ఎవరికి ఎంత సంపద కట్టబెడుతున్నాయో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది.

 వ్యాసకర్త సెల్: 8466827118