calender_icon.png 25 November, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల కబడ్డీ ప్రపంచకప్ విజేత భారత్

25-11-2025 12:04:01 AM

వరుసగా రెండోసారి టైటిల్ కైవసం

ఢాకా, నవంబర్ 24 : గ్రామీణ క్రీడ కబడ్డీలో మనకు ఎదురేలేదని మరోసారి రుజు వైంది. పురుషుల జట్టు తరహాలోనే మహిళల జట్టు కూడా కబడ్డీ ప్రపంచకప్‌లో దుమ్మురేపింది. ఈ ఏడాది మార్చిలో పురుషుల జట్టు కబడ్డీ వరల్డ్‌కప్ గెలిస్తే.. అదే స్ఫూర్తితో భారత మహిళల కబడ్డీ జట్టు కూ డా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఢాకా వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ 35 స్కోర్‌తో చైనీస్ తైపీపై విజయం సాధించింది.

ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా టైటిల్ నిలబెట్టుకుంది. గ్రూప్ ఏ నుంచి టేబుల్ టాపర్‌గా సెమీఫైనల్స్ చేరి న భారత జట్టు నాకౌట్ పోరులో ఇరాన్‌ను చిత్తు చేసింది. టైటిల్ ఫైట్‌లోనూ అదే జోరు ను కొనసాగిస్తూ చైనీస్ తైపీని నిలువరించింది. రీతూ నేగి కెప్టెన్సీలో టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళల కబడ్డీ జట్టు ఫైనల్స్‌లోనూ అదరగొట్టింది.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడు తూ వరుస పాయింట్లు సాధించింది. సెకండాఫ్‌లో చైసీన్ తైపీ కాస్త పుంజుకున్నట్టు కని పించినా ఆధిక్యం నిలబెట్టుకుంటూ భారత్ చాంపియన్‌గా నిలిచింది. భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచకప్ గెలవడం వరుసగా ఇది రెండోసారి. గత ఎడిషన్‌లోనూ భారత జట్టే టైటిల్ గెలుచుకుంది. మొత్తం 11 జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో భారత్, చైనీస్ తైపీ మాత్రమే ఒక్క ఓటమి లేకుండా ఫైనల్‌కు చేరాయి.

తుది పోరులో చైనీస్ తైపీకి భారత్ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కప్ సొంతం చేసుకుంది. కాగా ఈ  విజయం పై పలువురు మాజీ కబడ్డీ ప్లేయర్స్ భారత జట్టుకు అభినందనలు తెలిపారు. అలాగే వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచినందుకు తెలంగాణ క్రీడామంత్రి వాకిటి శ్రీహరి మహిళల కబడ్డీ జట్టును అభినందించారు.