28-07-2025 02:05:36 AM
హర్షవర్ధన్ జైన్ కేసులో విస్తుపోయే నిజాలు
లక్నో, జూలై 27: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నకిలీ రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హర్షవర్ధన్ జైన్ (47) అరెస్ట్ అయ్యాడు. హర్షవర్ధన్ విషయంలో విస్తుపోయే విషయాలు దర్యాప్తులో వెల్లడ వుతున్నాయి. ఇతగాడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పలు పత్రాలను యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) పరిశీలిస్తోంది. హర్యానాకు చెందిన అద్నాన్ ఖరాబ్జీతో పాటు పలువురు అంతర్జాతీయ నేరస్తులతో హర్షవర్ధన్ సమావేశం ఏర్పాటు చేసినట్లు బయ టపడింది.
హర్షవర్ధన్‌కు దుబాయ్‌లో ఆరు, బ్రిటన్‌లో మూడు, మారిషస్‌లో ఒకటి, భా రత్‌లో ఒక బ్యాంకు ఖాతా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ఎహసాన్ అలీ అనే టర్కిష్ పౌరసత్వం ఉన్న వ్యక్తితో కలిసి హర్షవర్ధన్ లండన్‌లో డజను కు పైగా షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు. హర్షవర్ధన్ తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త. రాజస్థాన్‌లో పాలరాతి గనులు ఉన్నాయని ఎస్టీఎఫ్ ఏఎ స్పీ రాజ్ కుమార్ మిశ్రా వెల్లడించారు.
162 ట్రిప్స్..
అంతర్జాతీయ స్థాయిలో హర్షవర్ధన్ ప లు ఆర్థిక నేరాలకు కూడా పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. హర్షవర్ధన్ 162 సార్లు వి దేశాలకు వెళ్లినట్టు, విదేశాల్లో ఆయన 25 షె ల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. హర్షవర్ధన్ దాదాపు రూ. 300 కోట్ల మేర స్కామ్‌కు పాల్పడినట్టు గు ర్తించారు. అధునాతన హంగులతో నిర్మించి న భవంతిలో హర్షవర్ధన్ నకిలీ రాయబార కార్యాలయాన్ని నడిపాడు. ‘బరోన్ ఆఫ్ వెస్టార్కిటికా’గా పరిచయం చేసుకునేవాడు.