calender_icon.png 28 July, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుతున్న చరిత్ర

28-07-2025 02:00:17 AM

-2030 నాటికల్లా అన్ని పాఠ్యపుస్తకాల్లో నిజమైన చరిత్ర!

- ఉన్నత విద్యా చరిత్ర పుస్తకాల్లోనూ సవరణలు

-నాటి పాలకుల మంచికే కాదు చెడుకు పుస్తకాల్లో చోటు

-ఎన్‌ఈపీ భాగంగా సవరణల దిశగా అడుగులు వేస్తున్న ఎన్‌సీఈఆర్‌టీ

-ఇప్పటికే 1 నుంచి 8 వరకు చరిత్ర పాఠ్యపుస్తకాల్లో మార్పులు

- వచ్చే ఏడాది 9వ తరగతి పుస్తకాల్లోనూ పలు సవరణలు

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) 2020లో భాగంగా భారతదేశ చరిత్ర, దేశా న్ని శతాబ్దాలుగా పాలించిన ఢిల్లీ సుల్తానుల నుంచి మొఘల్ పాలకులైన బాబర్, అక్బర్, ఔరంగజేబు పాలనపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రధానంగా దృష్టిసారించింది. చరిత్ర పాఠ్యపుస్తకాలను ఒకసారి చూస్తే వారు మంచి పరిపాలన అందించారని, ప్ర జలను చాలా బాగా చూసుకున్నారనే భావ న కలుగుతోంది.

నాటి పాలకుల దండయాత్రలు, రాజ్యవిస్తరణ, పాలనా వైభవం గురిం చే పాఠ్యపుస్తకాల్లో వివరించారు. అయితే దీనిపై 2023 నుంచి ఫోకస్ పెట్టిన ఎన్‌సీఈఆర్‌టీ ఢిల్లీ సుల్తానుల నుంచి మొఘల్ పాలకుల అసలైన చరిత్రను చూపించే విధం గా పాఠ్యపుస్తకాల్లో సవరణలు చేస్తూ వస్తోం ది. 2020లో ఎన్‌ఈపీ పాలసీని కేంద్రం తీ సుకొచ్చింది. ఈ పాలసీలో భాగంగానే చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చూపించే ప్రయ త్నం చేస్తుందనే అభిప్రాయాలను నిపుణు లు వ్యక్తం చేస్తున్నారు.

2023లో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చారు. 2023 నుండి కొత్త పుస్తకాలను రూ పొందిస్తున్నారు. తొలుత 6, 7 తరగతుల పుస్తకాలను రూపొందించారు. ఈ సంవత్సరం 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యాసంవత్సరం వరకు మొత్తం 1 తరగతి కొత్త పాఠ్యపుస్తకాలను ఎన్‌సీఈఆర్‌టీ తీసుకొచ్చింది.

ఇక వచ్చే సంవత్సరం 9వ తరగతి పాఠ్యపుస్తకాన్ని రూపొందించనుంది. తొలు త 1, 3, 6 తరగతి పుస్తకాలు, తర్వాత 2, 4, 7వ తరగతి, ఈ విద్యాసంవత్సరం 5, 8వ తరగతులకు సంబంధించిన పుస్తకాలను తీసుకొచ్చింది. ఇలా ఇంటర్ వరకు అన్ని పాతపుస్తకాలే అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా మార్చనున్నారు. 2030 నాటి కి ఉన్నత విద్యలోని భారత్ సెంట్రిక్ పుస్తకాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

సవరణలపై భిన్నాబిప్రాయాలు

ఎన్‌సీఈఆర్టీ కొత్తగా విడుదల చేస్తున్న పుస్తకాలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వివాదాలకు కూడా దారితీస్తోంది. చరిత్రను కావాలనే వక్రీకరిస్తున్నారని కొందరు అం టుంటే..మరికొందరేమో నిజమైన మన దేశ చరిత్రను తెలుసుకోవాలని అంటున్నారు. పాకిస్తాన్ అంశం కూడా ఇక్కడ చర్చకు వ స్తోంది. ఆ దేశ పాఠ్యపుస్తకాల్లోనూ మహమ్మద్ బిన్ ఖాసిం వంటి ముస్లిం పాలకుల ను కీర్తిస్తూ, పూర్వ భారతదేశాన్ని వెనుకబడినదిగా చిత్రీకరిస్తోంది. హిందూ, ముస్లిమేత ర పాలకులు అక్కడి వారికి వ్యతిరేకమని భావనను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఇలాంటి దారివైపు మళ్లుతుం దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 8వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకంలో ఎన్‌సీఈఆర్‌టీ  మొఘల్, సుల్తానుల కాలాలను “డార్క్ ఛాప్టర్స్‌”గా ప్రచురించింది.

ఇంతకాలం వారి మంచిని చెప్పారు.. ఇప్పుడు చెడునూ చెప్తున్నారు..

ఎన్‌ఈపీలో ఒక పాయింట్ వుంది. ఈ దేశపు పిల్లలకు ఈ దేశపు చరిత్ర చెప్పి ఈ దేశం మీద గౌరవాభిమానాలు పెంచాలని ఉంది. ఇంతకాలం ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలను వన్‌సైడ్‌గా, సెలెక్టెడ్‌గానే రాశారు. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న పుస్తకాల్లో ముస్లిం రాజులకు వ్యతిరేకంగా రాయలేదు. మొఘల్ పాలకులు చేసినవి ఏవైతే దాచిపెట్టారో ఇంతకాలం పిల్లలకు చెప్పని వాటిని కూడా చెప్తున్నారు. ఒక పరిపాలకుని గుణదోషాలు చెప్తున్నారు.

మన హిందూ రాజుల సాలువ వంశం, తుళువ వంశం, శ్రీకృష్ణ దేవరాయుల పరిపాలన తీసుకున్నా మంచి ఏం జరిగింది.. చెడు ఏం జరిగిందని చెప్తారు. అందులో పిల్లలే విశ్లేషించుకుంటారు. మొఘల్, ఢిల్లీ సుల్తానుల చరిత్రను పుస్తకాల్లో నెగిటివ్‌ను వైట్ వాష్ చేసి పాజిటివ్‌నే రాశారు. ఇన్ని రోజులు అక్బర్, ఔరంగజేబు మంచినే చెప్పారు...ఇప్పుడు వారి నెగిటివ్‌ను కూడా చెప్పాలి కదా. రెండూ చెప్పాలని ప్రయత్నం జరుగుతోంది. అయితే కావాలనే నెగిటివ్‌ను చెప్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్‌ఈపీను అమలులో భాగంగానే ఎన్‌సీఈఆర్టీ ఈ నిర్ణయం తీసుకుంటోంది.

 రావు, తెలంగాణ టెక్స్ బుక్స్ రైటర్

ముస్లిం రాజులే కాదు..హిందూ రాజుల చరిత్ర కూడా!

ఎన్‌ఈపీ పాలసీ ప్రకారం ఒకరికి వ్యతిరేకం కాదు..మరొకరికి అను కూలంగా కాదని ఎన్‌సీఈఆర్టీ చెబుతోంది. బాబర్, అక్బర్, ఔరంగజేబు రాజుల క్రూరమైన పాలనే కా దు.. వారు చేసిన మంచి పనులను సైతం తెలిసేలా పుస్తకాలను రాయాలని మార్గదర్శకాల్లో ఉంది. అంతేకాకుం డా హిందూ రాజుల మంచి, చెడు పాలన గురించి కూడా ఉన్నది ఉన్నట్లుగా రాయాలని సూచిస్తోంది.

ఇన్నిరోజులు చెప్పని విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నామని ఎన్‌సీఈఆర్టీ చెబుతోంది. ఢిల్లీ సుల్తా నులు, మొఘల్స్ నెగిటివ్స్‌ను వైట్ వాష్ చేస్తూ పాజిటివ్ రాశారని పు స్తక రచయిత ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. చరిత్రను పక్కదారి పట్టిస్తూ నాటి పాలకులను కీర్తిస్తూ పుస్తకాలు రాశారనే వాదనలూ వినిపిస్తున్నాయి.