calender_icon.png 28 July, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ మావోయిస్టులపై 17 లక్షల రివార్డు

28-07-2025 02:03:32 AM

  1. ఛత్తీస్‌గఢ్‌లో శనివారం నలుగురు మావోయిస్టులు మృతి
  2. మృతి చెందిన నలుగురిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు
  3. మృతులంతా సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందినవారు

రాయ్‌పూర్, జూలై 27: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం భద్రతా దళా ల ఎదురుకాల్పుల్లో మరణించిన నలుగురు మావోయిస్టులపై రూ. 17 లక్షల రివార్డు ఉ న్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్ద రు మహిళా మావోయిస్టులు కూడా ఉన్న ట్టు పేర్కొన్నారు. మృతులంతా సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందినవారని, చనిపోయి న వారిలో ముగ్గురు ఏరియా కమిటీ సభ్యు లు (ఏసీఎం) కాగా..

మరొకరు పార్టీ మెంబ ర్ అని వెల్లడించారు. బీజాపూర్ ఎస్పీ జితేం ద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘నక్సల్స్ కదలికలపై నిఘా వర్గాలు ఇచ్చిన స మాచారం మేరకు బీజాపూర్‌కు చెందిన డీఆర్‌జీ దళాలు సెర్చ్ ఆపరేషన్‌ను స్టార్ట్ చేశా యి. అడవులను జల్లెడ పడుతున్న భద్రతా దళాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపా రు. ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టు లు మృతి చెందారు.

సంఘటనా స్థలంలో ఎ స్‌ఎల్‌ఆర్, ఇన్సాస్ రైఫిల్, ఒక 303 రైఫిల్, ఒక బీజీఎల్ లాంచర్, ఒక సింగిల్ షాట్ వెపన్ పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, నక్సల్స్‌కు సంబంధించిన ఇతర వస్తువులు లభ్యమయ్యాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్లు హంగా (రూ. 5 లక్షల రివార్డు), లఖే (రూ. 5 లక్షల రివార్డు), భీమే (రూ. 5 లక్షల రివార్డు), నిహాల్ అలియాస్ రాహుల్ (రూ. 2 లక్షల రివార్డు) ఉన్నారు’ అని పేర్కొన్నారు. మొదటి ముగ్గురు ఏసీఎంలు కాగా, నిహాల్ అలియాస్ రాహుల్ పార్టీమెంబర్ అని వెల్లడించారు.