24-07-2025 01:04:36 AM
న్యూఢిల్లీ, జూలై 23: ఫ్యాషన్ రిటైలర్ సంస్థ మింత్రాపై ఈడీ కొరడా ఝులిపించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) నిబంధనలు ఉల్లఘించి రూ. 1,654 కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించి ఫారిన్ ఎక్సేంజీ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కేసు నమోదు చేసింది. మింత్రాతో పాటు అనుబంధ సంస్థలు, డైరెక్టర్లపై అభియోగాలు మోపింది.
మల్టీ బ్రాండ్ రిటైల్ వాణిజ్యాన్ని కొనసాగిస్తూ హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేస్తున్నట్టు మింత్రా పేర్కొన్నట్టు ఈడీ తెలిపింది. తప్పుడు వ్యాపారం చేయడం ఎఫ్‌డీఐ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. మింత్రా, దాని అనుబంధ సంస్థలు తప్పుడు కార్యకలాపాలు చేసున్నట్టు సమాచారం అందడంతో ఈడీ రంగంలోకి దిగింది.
ఈ క్ర మంలో మింత్రా డి జైన్స్ ప్రైవేట్ లిమిటె డ్ తాము హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం లో నిమగ్నమై ఉన్నామంటూ విదేశీ పెట్టుబడిదారుల నుంచి రూ. 1654.35 కోట్లు స్వీకరించింది. తమ ఉత్పత్తులను ఎక్కువగా వెక్టర్ ఈఫూ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు విక్రయించింది.
ఆ సంస్థ ఆ ఉత్పత్తులను రిటైల్ కస్టమర్లకు అమ్మింది. వాస్తవానికి మింత్రా, వెక్టర్ ఈ ఒకే గ్రూప్‌కు చెందిన కంపెనీలుగా ఈడీ గుర్తించింది. ఎఫ్‌డీఐ నిబంధనల ప్రకారం.. హోల్‌సేల క్యాష్ అండ్ క్యారీ సంస్థలు తమ గ్రూప్ కంపెనీలకు కేవలం 25శాతం మాత్రమే విక్రయాలు జరపాలి.