19-09-2025 12:07:48 AM
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 18 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఐడి సృష్టించారు. ఈ విషయం గమనించిన ఎస్పీ, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఎస్పీ ఫోటోను వాడి నకిలీ ఐడి రూపొందించి, ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో ఎస్పీ గైక్వాడ్ ప్రజలను అప్రమత్తం చేస్తూ నా పేరుతో లేదా ఫోటోతో ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినా, సందేశాలు పంపినా, వాటికి స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనిసూచించారు.