calender_icon.png 28 December, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ ఎస్వోటీ పోలీసుల అరెస్టు

28-12-2025 12:16:55 AM

కూకట్‌పల్లిలో వ్యక్తిని బెదిరించి, రూ.కోట్లు డిమాండ్

మేడ్చల్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని రూ.3 కోట్లు డిమాండ్ చేసిన నకిలీ ఎస్వోటీ పోలీసులను పోలీసులు పట్టుకున్నారు. మూసాపేట శివారులో సైబర్ సిటీ మెరీనా స్పేస్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంటికి శనివారం వెళ్లిన నిందితులు.. తాము మాదాపూర్ ఎస్వోటీ పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. యజమానిని ౩ కోట్లు ఇవ్వాలని లేదంటే కేసు బుక్ చేస్తామని భయపెట్టారు. దీంతో సదరు వ్యక్తితో అతడి తమ్ముడికి ఫోన్ చేయించి డబ్బులు తీసుకురావాలని బెదిరించారు. బాధితుడి తమ్ముడి మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి వెళ్లగా.. నిందితులు బాధితుడ్ని అపార్టుమెంట్ గేటు వరకూ తీసుకొచ్చా రు. అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఒకరు పరారయ్యారు.