calender_icon.png 28 December, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంపై తప్పుడు ప్రచారం సహించం

28-12-2025 12:15:37 AM

క్యాడర్‌కు పిలుపునిస్తే మీ అడ్రస్ గల్లంతు

పార్టీ ఫిరాంపులు మొదలు పెట్టిందే.. బీఆర్‌ఎస్

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

హైదరాబాద్, డిసెంబర్  27 (విజయక్రాంతి) : ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి  హనుమంతరావు స్పష్టం చేశారు. తాము క్యాడర్‌కు పిలుపునిస్తే మీ అడ్రస్ గల్లంతు అవుతుంది.. మేం భాష మాట్లాడితే మీరు తట్టుకోలేరు.. అని బీఆర్‌ఎస్ నాయకులకు హనుమంతరావు  హెచ్చరించారు. ఇతర పార్టీల నుంచి నాయకులను, మంత్రులు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది బీఆర్‌ఎస్ పార్టీనేనని ఆయన మండిపడ్డారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, పీసీసీ నాయకులు చరణ్‌కౌశిక్ యాదవ్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

బీఆర్‌ఎస్ నాయకులు అవినీతి అక్రలకు పాల్పడటమే కాకుండా ప్రశ్నించిన వారిని పోలీసులతో కొట్టించి ఇష్టం వచ్చినట్లు పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. హజీజ్ నగర్‌లో హరీశ్‌రావు  అక్రమంగా కట్టుకున్న ఫామ్‌హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాతో కూలగొట్టాలని హనుమంతరావు కోరారు. దళితులు, పేద వర్గాలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారులు, ఐఏఎస్ అధికారులను బూతులు తిట్టిన విషయం మర్చిపోవద్దని ఆయన హితవు పలికారు.