calender_icon.png 13 January, 2026 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసత్య ఆరోపణలు మంచిది కాదు

13-01-2026 01:41:48 AM

ఐఏఎస్‌లపై మీడియా కథనాలు

  1. జిల్లాల పునర్విభజనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు లేవు
  2. మంథని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా
  3. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారులపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సోమవారం మంథని పట్టణం లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై అసత్య ఆరోపణలు సరికాదన్నారు. అదేవిధంగా జిల్లాల పునర్విభజనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు లేవని మంత్రి స్పష్టం చేశారు. మంథని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు.