calender_icon.png 13 January, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు

13-01-2026 01:39:41 AM

సంబురాల సంక్రాంతి

  1.   2023 జులై 1 నుంచి అమలు 
  2. జీపీఎఫ్ ఖాతాలో జమచేయనున్న సర్కార్ 
  3. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి) : సంక్రాంతి పండుగ పూట ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం డీఏ (కరువు భత్యం)  పెంచుతూ  శుభవార్త చెప్పింది. డీఏను 3.64 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం జీవో నెంబ ర్ 2ను విడుదల చేశారు. 2023 జులై 1వ తేదీ నుంచి అమలు కానుంది. ఈ  జనవరి వేతనంతో కలిపి ప్రభుత్వం డీఏ చెల్లించనుంది. జిల్లా , మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, వ్యవసాయ, మార్కెంట్ కమిటీ  యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ తదితర ఉద్యోగులకు కూడా ఈ డీఏ వర్తించనుంది.

జులై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న బకాయిలన్నింటిని ప్రభుత్వం చెల్లించనుంది. బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనుంది. రీటైర్ అయ్యే ఉద్యోగులకు 30 విడతల్లో బకాయిలు చెల్లించనుంది. పార్ట్‌టైమ్ అసిస్టెంట్లు, వీఆర్‌ఏలకు నెలకు రూ. 100 అదనంగా చెల్లించనుంది. అంతకుముందే సీఎం రేవంత్‌రెడ్డి డీఏ ఫైల్‌పై సంతకం చేసినట్లు గెజిటెడ్ ఆఫీసర్ డైరీ ఆవిష్కరణలో ప్రకటించారు.