calender_icon.png 4 July, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లకు నిధులు

04-07-2025 12:51:18 AM

ఒక్కో స్కూల్‌కు లక్షన్నర నుంచి రెండు లక్షలు

హైదరాబాద్, జులై 3 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖ అధికా రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పునఃప్రారంభం చేసిన జీరో ఎన్‌రోల్‌మెంట్ ప్రభుత్వ పాఠశాలలకు మెయింటెనెన్స్ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో పాఠశాలకు రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు నిధులను ఇవ్వనున్నారు. వాటి ద్వారా ఆయా పాఠశాల ల్లో తాగు నీరు, విద్యుత్, గోడలకు రంగులు వేయడం లాంటి వసతులను ఏర్పాటు చేసుకునేలా అధికారులకు ఆదేశించనున్నా రు.

గతంలో మూసివేసిన 138 బడులను తిరిగి తెరుస్తున్న ట్లు జూన్ 25న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన వెంటనే నిధులను ఆయా పాఠశాలలకు విడుదల చేస్తామని గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. దీంతోపాటు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం అవసరమైన పాఠశాలలకు నిధులను మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోని కేజీబీవీ, పీఎంశ్రీ, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను స్ట్రెంతెన్ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చినట్లేనని ఆశాభావం వ్యక్తం చేశారు.