04-07-2025 12:55:56 AM
-కంపు కొడుతున్నఎల్లారెడ్డి మున్సిపాల్టీ
-అర్ధాంతరంగా ఆగిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్
-నత్త నడకన వంద పడకల దవాఖాన
ఎల్లారెడ్డి,జులై 3 (విజయ క్రాంతి); పేరుకే అది మున్సిపాలిటీ. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా కామారెడ్డి జిల్లా లో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందుతుందని పట్టణ ప్రజలు భావించారు. ప్రజా ప్రతినిధుల పాలన లో అభివృద్ధి జరగక ఉన్న ప్రత్యేక అధికారుల పాలన వచ్చినా కూడా అభివృద్ధి లో మాత్రం ముందుకు సాగడం లేదు.
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిస్థితి చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న పరిస్థితి ఉంది. గ్రామపంచాయతీ నుంచి ఎల్లారెడ్డి మున్సిపాలిటీగా హోదా పెరిగిన అభివృద్ధి మాత్రం ముందుకు రావడం లేదు. ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణానికి సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ప్రారంభంలో ఉన్న నాటి నుంచి మున్సిపల్ పట్టణం అదేవిధంగా ఉండడంతో ప్రజలు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో గ్రామపంచాయతీ
గతంలో గ్రామ పంచాయతీ గా ఉన్న ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణముగా ఏర్పడినప్పటి నుంచి 2018 ఆగస్టు 2వ తేదీ నుండి పంచాయతీ నుంచి మున్సిపల్ పట్టణంగా ఏర్పడిన రోజుగా ఆ రోజు నుంచి అభివృద్ధి అని చెప్పడమే తప్ప అక్కడ జరిగేదేమీ లేదని ఫ్లెక్సీలకే పరిమితం గా ఏర్పడుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. 2018 ఆగస్టు 2 నా ఏర్పడిన నూతన మున్సిపాలిటీ విస్తీర్ణం 24. 32 కిలోమీటర్ల విస్తీర్ణం 12 వార్డులు 4196 నివాస గృహాలు, 262 నుంచి 300 వరకు దుకాణ సముదాయాలు పట్టణ జనాభా 19,750 మంది 12065 మంది ఓటర్లు, కలిగిన మున్సిపాలిటీగా ఎల్లారెడ్డి పురుడు పోసుకుంది.
పన్నులు వసూలు చేస్తున్న అభివృద్ధి శూన్యం
ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలో ఆస్తి పన్ను, నీటి పన్ను ,వ్యాపార లైసెన్సులు, వాణిజ్య ప్రకటనలు ,పన్ను, లేఅవుట్ ఫీజ్, భవన నిర్మాణ అనుమతుల ఫీస్, మంచినీటి నల్ల కనెక్షన్, పశువుల సంత, తై బజార్, వం టి వ్యాపారుల నుంచి కూడా మున్సిపాలి టీకి సుమారు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల వరకు ప్రజలు పన్ను రూపం లో చెల్లిస్తారు. కానీ పట్టణంలో నీ ప్రజలకు మున్సిపాలిటీ అందించే సేవలు అరకోరా వసతులతో కొట్టుమిట్టాడుతున్నాయి.
అభివృద్ధిపై పట్టించుకోని అధికారులు
అధికారుల్లో సరైన బాధ్యత లేకపోవడంతో లక్ష్యం గాడి తప్పుతుందని ప్రజలు వాపోతున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధుల నుంచి ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలో బస్టాండ్, పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు సుమారు ప్రత్యేక నిధుల ద్వారా మూడు నుంచి ఐదు కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ మున్సిపల్ పట్టణంలో పనులు అర్ధాంతరంగానే ఆగాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.