calender_icon.png 4 July, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణ నిలవదు

04-07-2025 12:36:02 AM

-నేడు సంతోషపడ్డా భవిష్యత్తులో కూల్చివేత తప్పవు 

- అధికారులు పట్టించుకోకుండా.. కోర్టు ఉంది కదా..

- పలుచోట్ల కుంటలు, చెరువులు భూములు కబ్జాలు 

- జడ్చర్ల నల్లకుంటలో ఎఫ్టిఎల్ కబ్జా నుంచి వీడింది

- కబ్జాలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే 

మహబూబ్‌నగర్, జూలై 3 (విజయ క్రాంతి) : చెరువులు, కుంటలు ఆఆక్రమణ లు చేసుకొని అప్పుడప్పుడు సంతోషపడు తున్న సరియైన సమయంలో కూల్చివేతలు తప్పవు అనే నిజాన్ని ప్రతి ఒక్కరు గుర్తుం చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జిల్లా కేంద్రంలోని దొంగలకుంట, ఏను గొండ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సమీ పంలోని గుంటకట్ట తొలగింపు, జడ్చర్ల లోని నల్లకుంట లో ఎఫ్ టి ఎల్ పరిధి కబ్జా.. ఇలా పలుచోట్ల అందిన కాడికి దర్జాగా కబ్జాలు చేసి ఆక్రమించుకుందామనుకుంటే భవిష్య త్తులో ఇబ్బందులు తప్పవని విషయాన్ని కోర్టు స్పష్టంగా చెబుతుంది.

ఇకనైనా ఇలాం టి ఆలోచనలతో అడుగులు వేసే కబ్జాదా రులకు భవిష్యత్తులో ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లి చెరువుల, కుంటల భూములు కబ్జాకు గురయ్యాయని సరైన ఆధారాలతో వివరిస్తే ఎన్ని ఏళ్లు అయినా కోర్టు సరైన పత్రాలు ఉండడంతో కూల్చివేతలకు ఆదేశించే అవకా శాలు మెండుగా ఉన్నాయి. కబ్జాలు చేసే వారు ఎవరైనా కొంత ఆలోచన చేసి ఆ దిశ గా అడుగులు వేయకుండా ఉంటేనే మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 

- పూర్వపు స్థితికి నల్లకుంట...

జడ్చర్ల నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా గత కొన్ని నెలలుగా నిలుస్తున్న నల్లకుం ట ఎఫ్ టి ఎల్ పరిధి కబ్జా ఫోటో ఆదేశాల తో అడ్డంగా నిర్మించిన కాంపౌండ్ వాళ్లతో పాటు తదితర నిర్మాణం గురువారం తొల గించారు. మున్సిపల్ అధికారులకు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో నల్లకుంట లోని ఎఫ్.టి.ఎల్ పరిధి ఒక ఎకరా 30 గుం టల భూమికి సంబంధించి సర్వే చేయించి క బ్జా చేసిన వారి నుంచి ఉపశమనం కలిగిం చారు.

భవిష్యత్తులోనూ ఈ ప్రాంతం లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని, ప ట్టా ఉన్నప్పటికీ నిర్మాణాల జోలికి పోకూ డదని అధికారులు స్పష్టంగా తెలిపారు. ఎక్కడైనా కబ్జాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల మున్సిపల్ కమిష నర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నల్లకుంట ఎఫ్ టి ఎల్ పరిధి కబ్జా చేర నుంచి విడిపిం చడంతో జిల్లావ్యాప్తంగా ఈ అంశం ఆసక్తిని పెంచుతుంది. కోట్లాది రూపాయల భూముల పై ఎవరికన్ను పడిన అది ఎంతో కాలం నిలువదని నిబంధన మీదకు ముం దుకు సాగితే భవిష్యత్తు సంతోష కరంగా ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు. 

- కబ్జాదారుల్లో బూగుల్...

జడ్చర్ల నల్లకుంట చెరువు ఎఫ్ టి ఎల్ పరిధికి సంబంధించి కబ్జా చేసిన వారి నుంచి పూర్తిస్థాయిలో నిర్మాణాలు తొలగిం పు కావడంతో చెరువులు కుంటలు కబ్జాలు చేసిన వారి గుండెల్లో గూబుల్ మొదలైంది. ప్రభుత్వ భూములే కదా అడిగేది ఎవరు అనుకుంటే పొరపాటు పడినట్లేనని... భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఎదురై తే పెట్టుబడులు పెట్టి ఏమి ఉపయోగం అని ప్రశ్న కబ్జాదారులలో నెలకొంటుంది. నల్లకుంట కు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఈ అంశం ప్రత్యేక చర్చ నీయాఅంశంగా మారింది.

కాగితాలు పుట్టించి కబ్జాలు సృష్టించి ప్లాట్లు చేసి విక్రయించిన భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. అధికారులు ఆ భూములకు అడ్డంగా నిలిచినప్పటికీ కోర్టు ఆదేశాలను బేకతార చేయలేక అమలు చేయవలసిన అవసరం ఉంటుందనే విషయం కూడా స్పష్టమవు తుంది.  దీంతో కబ్జాలు చేసే వారికి ఇబ్బందులు తప్పవని సాంకేతం కోర్టు ఉత్తర్వులతో స్పష్టమవుతుంది.