calender_icon.png 26 July, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాథ్యూ వేడ్ వీడ్కోలు

30-10-2024 12:00:00 AM

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు మంగళవారం వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల వేడ్ ఆసీస్ తరఫున 36 టెస్టులు, 97 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన వేడ్ 2021 టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో చివరిసారిగా పాల్గొన్నాడు. 2020లో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ మాథ్యూ వేడ్ దేశవాలీ క్రికెట్ ఆడనున్నాడు.

ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన వేడ్ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. పాకిస్థాన్‌తో టీ20, వన్డే సిరీస్‌కు కూడా వేడ్ సహాయక కోచ్‌గా సేవలందించనున్నాడు. ఇక ఐపీఎల్‌లో 2022లో చాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో మాథ్యూ వేడ్ సభ్యుడిగా ఉన్నాడు.