30-10-2024 12:00:00 AM
ముంబై: న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టెస్టు కోసం భారత యువ పేసర్ హర్షిత్ రానా జట్టుతో కలవనున్నాడు. రంజీ మ్యాచ్ ముగిసిన వెంటనే హర్షిత్ ముంబైకి బయల్దేరి వెళ్లాడు. అస్సాంతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టిన హర్షిత్ ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రంజీ ల్లో రాణించడంతో హర్షిత్‌ను అదనపు బౌలర్‌గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఆసీస్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా హర్షిత్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మూడో టెస్టుకు కూడా దూరమైనట్లు కివీస్ బోర్డు ప్రకటించింది.