13-08-2025 12:32:01 AM
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ప్రొ.జయదీర్ తిరుమల రావు
జిల్లాల్లో 23న అధికారికంగా పోలాల పండగ నిర్వాహణ
ఆదిలాబాద్, ఆగస్టు 12(విజయక్రాంతి): ఎడ్లను పూజించే పొలాల పండుగ మన సంస్కృతిని, వ్యవసాయాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తాంసి మండల కేంద్రంలో ఈనెల 23వ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న పొలాల పండగను అంద రం కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మంగళవారం ఆద్యకళా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు, వివిధశాఖల అధికారులు, గ్రామ స్తులతో కలిసి గ్రామంలో నిర్వహించే పొలా ల పండగ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సెల్ఫీ పాయింట్, తదితర వాటిని పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశా రు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పొలాల పండగ పై చిత్రీకరించిన డ్యాక్యూమెంటరీని వీక్షించారు.
ఈ డాక్యుమెంటరీలో 3 రోజుల పండగకు సంబంధిం చి దృశ్యాలు 10 నిముషాల నిడివి తో చిత్రీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. తెలంగాణా సంస్కృతిలో ఎన్నో పండగలు ఉన్నాయని అందులో వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడే ఎడ్లను పూజించే పొలాల పండగ ఒకటన్నారు. ఈపండగను రైతులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారన్నారు.
ఈ ఏడాది తాంసిలో అధికారికంగా నిర్వహించనున్న ఈ పండగ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా అందరూ కలిసికట్టుగా పని చేసి విజయవంతం చేయాలని కోరారు. పండుగ సందర్భంగా పలు సాం స్కృతిక ప్రదర్శనలు, హస్తకళల ప్రదర్శనలు, తినుబండారాల స్టాళ్లు, జానపద నృత్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం శాఖ అధికారి రవి కుమార్, డిఆర్డీఓ రవీందర్, డీపీఓ రమేష్, డీఏఓ శ్రీధర్ స్వామి, స్పెషల్ ఆఫీసర్ వెంకట రమణ, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీతో పాటు గ్రామస్థులు కృష్ణ, జీవన్, శ్రీనివాస్, రామన్న యాదవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.