calender_icon.png 14 August, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా

13-08-2025 12:32:28 AM

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, ఆగస్టు 12 ( విజయక్రాంతి ) : ఆటో డ్రైవర్ల  సమస్యలను పరిష్కరిస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి  హామీ ఇచ్చారు.  ఆటో డ్రైవర్ల తమ స మస్యల్ని పరిష్కరించాలని కోరుతూ  ఐఎన్టీయుసి నాయకులు రాములు యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు వారి క్యాంపు కార్యాలయంలో  కలిసి వినతిపత్రం అందజేశారు. 

గత 15 సంవత్సరాలుగా  ఆటోలు నడుపుకొని జీవనం సాగిస్తున్నామని, నూతనంగా ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణ లో షాపులు నిర్మించడం చేత  తమ ఆటోలను ఆపనివ్వడం లేదని ఎమ్మెల్యే కి వివరించారు.  వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో బాబు మియా, రవికుమార్, నాగరాజు, మనోహర్, ఆంజనేయులు, పాషా, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.