13-08-2025 12:30:33 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్,ఆగస్టు12( విజయక్రాంతి): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెం దేందుకు ప్రభుత్వం అనేక చేయూత పథకాల ద్వారా కృషి చేస్తుందని, ఈ నేపథ్యంలో అర్హత గల ప్రతి మహిళను స్వయం సహాయక సం ఘాలలో చేర్పించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికా రి దత్తారావుతో కలిసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహా యక సంఘాల ఏర్పాటుకు గ్రామైక్య సంఘా ల వి.ఓ.లు, ఎ.పి.ఓ.లు, కమ్యూనిటీ సమన్వయకర్తలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమా నికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రభుత్వం మహిళల పేరిట అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద అనేక వ్యాపారాలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, ఇతర ఎంట్ర్పజెస్ ల నిర్వహణకు తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.
సంఘంలో సభ్యులు గా చేరితే కలిగే ప్రయోజనాలపై మహిళలకు అవగాహన కల్పించాలని, ఈ నెల చివరిలోగా ప్రతి మహిళ సంఘంలో సభ్యులుగా ఉండేలా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ యాదగిరి, శేష రావు, యశోద, నరేందర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.