29-10-2025 05:05:02 PM
నిర్మల్ (విజయక్రాంతి): టిఆర్ఎస్ సీనియర్ నేత మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల మృతి చెందడంతో బుధవారం రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయనను పరామర్శించారు. సత్యనారాయణ రావు చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు స్థానిక నాయకులు ఉన్నారు.