calender_icon.png 11 December, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ షాక్‌తో రైతు మృతి

11-12-2025 01:32:49 AM

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 10 (విజయ క్రాంతి): కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన అల్లాపురం లింగయ్య వయసు (59) సంవత్సరాలు.

అల్లపురం లింగయ్య గ్రామ శివారు పరిధిలో గల పంట పొలంలో తుకంకు నీళ్లు పారపెట్టడానికి  వెళ్లాడు.వరితుకనికి పందుల రక్షణ కొరకై తుకం చుట్టు జియో వైరుకు కరెంట్ షాక్ పెట్టాడు.ప్రమాదవశాత్తున కరెంట్ షాక్ తగలడంతో కుడి కాలుకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లి చూసేసరికి నిజంగానే అల్లపురం లింగయ్య చనిపోయి ఉన్నాడు. భార్య అల్లపురం లక్ష్మవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు. మృతు నికి ఇద్దరు కూతుర్లు  కుమారుడు ఉన్నారు.