calender_icon.png 16 August, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతా పారిశ్రామిక సంఘం భూమిని కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాలి

16-08-2025 05:11:48 PM

కనిపర్తి గ్రామ గౌడ కులస్తులు

స్థలాన్ని పరిశీలించిన కోర్టు అడ్వకేట్ కమిషనర్ విష్ణు

రేగొండ,(విజయాక్రాంతి): గీత పారిశ్రామిక సహకార సంఘం భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కనుపర్తి గౌడ కులస్తులు కోరుతున్నారు. మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన 200 కుటుంబాలు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకొని 18 ఎకరాల 30 గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షులు ముత్యాల తిరుపతి గౌడ్ తెలిపారు. కాగా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గౌడ కులస్తుల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా భూపాలపల్లి జిల్లా కోర్టులో దాఖలు చేసినట్లు తెలిపారు.

సోమవారం జిల్లా కోర్ట్ జడ్జి ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేసి అడ్వకేట్ విష్ణు పంపించగా శనివారం ఆయన కనపర్తి గ్రామానికి చేరుకొని గౌడ కులస్తుల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ... తాళ్లు ఎక్కి కళ్ళు అమ్ముకొని జీవనోపాధి గడుపుతుంటే కొందరు వ్యక్తులు తమ భూమిని కాజేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సుమారు 30 ఏళ్ల క్రితం భూమిని కొనుగోలు చేసి తాటి చెట్లు పెంచుకుందామని తెలిపారు. వృత్తిపై ఆధారపడి జీవించే మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసి మా భూమిని కాజాయాలని చూస్తున్న వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చర్యలు చేపడతామని అన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వం, అధికారులు మాకు సహకరించి మా భూమిని కబ్జా చేయకుండా చూడాలని వారు కోరారు.