calender_icon.png 29 September, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా మహేష్

29-09-2025 12:00:00 AM

-రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) :  తెలంగాణ ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ హోటల్‌లో జరిగిన  తెలంగాణ ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కొనగాలను గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ , మండల ఎంపీడీవో, డీపీ కార్యాలయాల్లో సంక్షేమ పథకాల అమలులో 2015 నుంచి 1,579 మంది ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పీపీలను గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఈపీలను ఆదుకుంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ చానల్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈపీవోలను సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.