calender_icon.png 14 September, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు రుణమాఫీ వెంటనే విడుదల చేయాలి

14-09-2025 01:30:38 AM

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు రుణమాఫీ సాధన సమితి కన్వీనర్ శం కరయ్య ఆధ్వర్యంలో రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి శనివారం ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు. 

రైతు రుణమాఫీ కోసం రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతులు దీక్షలు చేయకుండా ప్రభుత్వం పోలీసులతో మైకులు తీయించడం, టెంట్లు కూల్చివేయ డం ఒక విధంగా రైతుల మీద జులుం ప్రదర్శించడమేనని ఇది సరైన పద్దతి కాదన్నారు. పోలీసులు ప్రజల కోసం పని చేయాలని నాయకులకు బానిసల్లా ఉండొద్దన్నారు.

పత్రికలు, టీవీ ఛానళ్లు రైతు సమస్యలను చూపించకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు చేరేలా చేసి రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలు చేసిన  ప్రభుత్వం మేడ్చల్, ఘట్ కేసర్, మూడుచింతలపల్లి రైతులకు ఎందు కు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చరిత్రలో లిఖించబడి ఉందని గుర్తు చేశారు.  రైతులకు రుణమాఫీ జరిగే వరకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

రైతు సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. రైతులు చేసే ఉద్యమా న్ని తొక్కేయా లని చూస్తే రాబోయే రోజుల్లో రైతులు కర్రు కాల్చి వాతలు పెడతారన్నారు. రైతులకు మద్దతుగా బిజెపి జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి,  సొసైటీ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, బి. స్రవంతి, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి,

మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి, సింగిరెడ్డి సాయిరెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు కాలేరు రామోజీ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొమ్మిడి శోభారాణి, మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బస్వ రాజుగౌడ్, మాజీ అధ్యక్షులు విప్పర్ల హనుమాన్, చలువాది ప్రవీణ్ రావు, మాజీ ఉప సర్పంచ్ బొక్క సురేందర్ రెడ్డి, నాయకులు మారం లక్ష్మారెడ్డి, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, ఏనుగు మచ్చేందర్ రెడ్డి, కొమ్మిడి జైపాల్ రెడ్డి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.