calender_icon.png 14 September, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ అభివృద్ధి, విజ్ఞత, వినోదానికి కేబుల్ ఆపరేటర్లు కృషి

14-09-2025 01:28:56 AM

  1. కాంగ్రెస్ అవినీతి బాగోతం బయటపడుతుందనే ఉద్దేశ్యంతో కేబుల్స్ కట్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం

కేబుల్ ఆపరేటర్ల ధర్నాలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

ముషీరాబాద్, సెప్టెంబర్ 13(విజయక్రాంతి):  కేబుల్ ఆపరేటర్లు సమాజ అభివృ ద్ధి,  విజ్ఞత, వినోదం అందించడం కోసం ఎం తో కృషి చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు బయటపడకుండా ఉండాలంటే కేబుల్ ప్రసారాలు నిలిపివేస్తే ప్రజలకు తెలియకుం డా ఉంటుందన్న ఉద్దేశంతోనే కేబుల్స్,  ఇం టర్నెట్ టీవీ ప్రసారాలని ఆగేటట్లు ఇలాంటి చర్యలకు కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఈ మేరకు శనివారం హైదరా బాద్ ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ ఆధ్వ ర్యంలో భారీ ఎత్తున మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ ఎంపీ బూర నర్స య్య, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మాట్లాడు తూ కేబుల్ ఆపరేటర్లు సమాజ అభివృద్ధి, విజ్ఞత, వినోదం అందించడం కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

కేబుల్ పరిశ్రమలో ఐదు, 6 లక్షల మంది జీవనఉపాధి పొందుతున్నారు. తద్వారా వారిపై ఆధారపడ్డ కు టుంబ సభ్యులు నడిరోడ్డుపై పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి విద్యుత్ అధికారులే కారణమైన కార కులు కేబుల్ ఆపరేటర్లు అని నిందలు మో పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కనీసం వారం పది రోజులైనా కేబుల్ ఆపరేటర్లకు సమయం ఇవ్వకుండా  కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే విధంగా కాంగ్రె స్ ప్రభుత్వం వ్యవహారిస్తుందన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ ఏ పోరాటానికైనా సిద్ధమని తెలు పుతూ, తమ సంపూర్ణ మద్దతు కేబుల్  ఆపరేటర్లకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ తర్వాత గౌరవ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, అధ్యక్షుడు సతీష్ బాబు, ఉపాధ్యక్షులు అబ్దుల్ సలాం, కర్ణాకర్, ప్రధాన కార్యదర్శి అరవింద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు నవీద్, శివాజీ, షాబుద్దీన్, వెంకటేష్, ఫన్నీ కృష్ణ, సంజయ్ కార్తీక్, శివరాజ్ నాతో పాటు వివిధ జిల్లాల కేబుల్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.