31-10-2025 01:45:43 PM
 
							మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ మండల నిలకుర్తి గ్రామపంచాయతీ లో పంటలకు నీటి తడులందించేందుకు పొలాల్లో బోరు బావులకు అమర్చిన విద్యుత్ సబ్మెర్సిబుల్ మోటర్ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో రైతు ఆందోళనకు గురవుతున్నాడు. బాధితుల కథనం మేరకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని నీలకుర్తి గ్రామ పంచాయతీకి చెందిన ఘనపరపు మల్లయ్య పరిధిలో పొలం సాగు చేస్తు ండగా పోలానికి తడులను అందించేందుకు పొలంలో బావిలో 5 హెచ్ పి సామర్థ్యం కలిగిన ఒక మోటర్ ను అమర్చాడు. రోజులా గే శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి మోటర్ ఆన్ చేసేందుకు ఉపక్రమించగా మోటార్ విడిభాగాలుగా కనిపించడంతో సూరికి గురైనట్టు గుర్తించాడు.5హెచ్ పి మోటార్ విలువ 15 వేల వరకు ఉంటుందని రైతు తెలిపారు. చోరీపై రైతు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.