31-10-2025 01:43:10 PM
 
							సమీకృత కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో సమీకృత భవనం
పటాన్ చెరు: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సమీకృత కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఉదయం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Patancheru MLA Gudem Mahipal Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల సౌజన్యంతో భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.
ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలో భాగంగా నీటిపారుదల, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, అంగన్వాడి భాగాలకు చెందిన నియోజకవర్గ స్థాయి కార్యాలయాలు అన్నింటిని ఒకే భవనంలో కార్యకలాపాలు నిర్వహించేలా భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలోని ప్రభుత్వ విభాగాలన్నింటికీ శాశ్వత ప్రాతిపదికన ఆధునిక వసతులతో భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు సంపూర్ణ సహకారం అందించిన ఆదిత్రి యాజమాన్యం నాగేశ్వరరావు, సురేష్ లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.