31-10-2025 01:48:38 PM
 
							సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపల్ కార్యలయంలో (Sultanabad Municipal Office) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, పటేల్ విగ్రహానికి కమిషనర్ రమేష్ పూలమాల లు వేసి నివాళులర్పించారు , ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు అన్ని ,భారత దేశపు మెదటి ప్రదానమంత్రి , హోంమంత్రి గా పని చేశారని, ఆయనను భారతదేశపు ఉక్కు మనిషి గా పిలుస్తారు అని తెలిపారు. ఆయన స్వాతంత్ర్యము అనంతరం అనేక సంస్ధాలను భారతయూనియన్ లో ఏకం చేయడంలొ కీలక పాత్రపొషించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ మెనేజర్ ఆలి మోద్దిన్ , మున్సిపాల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..