calender_icon.png 1 November, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొంథా తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి: ఏఐకేఎంఎస్

01-11-2025 12:00:54 AM

కొత్తగూడెం, అక్టోబర్ 31, (విజయక్రాంతి):అఖిలభారత రైతు కూలీ సంఘం(ఏ ఐ కె ఎం ఎస్) రాష్ట్ర కార్యవర్గం పిలుపులో భాగంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నందు ఎ.ఓ రాదాకృష్ణ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడుతు,తడిసిన పత్తి, మొక్కజొన్నలు, వరి, ధాన్యాలను మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాలను, సరిపడా ఏర్పాటు చేసి త్వరితగతిన పంటను కొని 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇవ్వాలి.

మద్దతు ధరకు తక్కువగా ప్రైవేట్ వ్యాపారులు కొంటే ధర వ్యత్యాసాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. తుఫాను వలన రైతులకు జరిగిన నష్టాన్ని గుర్తించి తగిన నష్టపరిహారం చెల్లించాలి. యుద్ధ ప్రాతిపదికన పంట నష్టాలను గుర్తించాలి. తక్షణమే ప్రభుత్వం, సంబంధిత అధికారులు కార్యాచరణకు దిగాలని కోరారు.ప్రభుత్వం సరియైన చర్యలు చేపట్టనట్లయితే నవంబర్ 10న, రైతులను పెద్ద సంఖ్యలో కదిలించి ధర్నా చేపడతామని తెలియజేశారు. విదేశీ పత్తికి సుంకాలు ఎత్తివేయడంతో పత్తి రైతులు,తీవ్రంగా నష్టపోతున్నారు.

కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయిన మోడీ ప్రభుత్వం దిగుమతి సుంకాలను ఎత్తివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు.ఇప్పటికే రైతులు,మిల్లర్లు,చిన్న చిన్న వ్యాపారులు ఆందోళలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయ కులు జిల్లా నాయకులు ఎస్కే ఉమర్ బట్టు ప్రసాదు సూర్ణపాక నాగేశ్వరరావు కుంజ కృష్ణ జక్కు ల రాంబాబు హర్జ రాఘవులు నరసింహ నరేష్ కోరం సీతారాములు జిల్లా కార్యవర్గ సభ్యులందరూ పాల్గొన్నారు.