01-11-2025 12:00:54 AM
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
శివంపేట్,(విజయక్రాంతి): శుక్రవారం శివంపేట మండల కేంద్రంలోని ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లో కూడా ఏ ఒక్క రైతు నష్ట పోకుండా దళారులను ఆశ్రయించకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని అన్నారు. రైతులు తెచ్చిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా చూడాలని సంబంధిత అధికారులను సూచించారు.