20-10-2025 01:20:30 AM
వనవాసీ కల్యాణ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర రావు
బోథ్, అక్టోబర్ 1౯ (విజయక్రాంతి): భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు మూ లం ఆదివాసీల సంప్రదాయాలేనని అవి భారతదేశ నగరాల్లో పట్టణాల్లో కనిపించవని వనవాసీ కల్యాణ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర రావు దేశ్పాండే పేర్కొన్నారు.
ఆదివారం బోథ్ మండలంలోని ఇన్కరి గూడ గ్రామంలో జరిగిన దండారీ ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. రాణి దుర్గావతి, బిర్సాముండా, కొమురం భీం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆదివాసి సమాజం కోసం మనమందరం కలి సిమెలిసి పని చేయాలని సూచించారు.
ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సార్ మేడి ఆడేం భీంరావ్, జుగది రావ్, పంద్రం శంకర్, తొడసం అజయ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వామన్ రావ్ దేశ్పాండే, న్యాయవాది ఆడెపు హరీష్, నరేష్, కపిల్ గ్రామస్తులు పాల్గొన్నారు.