calender_icon.png 28 August, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

28-08-2025 04:57:44 PM

ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముస్తాబాద్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై గణేష్(SI Ganesh) పలు సూచనలు చేశారు. మానేరు నది పరివాహక గ్రామాలైన కొండాపూర్, రామ్ లక్ష్మణ పల్లె, ఆవునూరు, తుర్కపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా ఎవరు బయటకు రావద్దని పేర్కొన్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉదృతంగా ప్రవాహం ఉన్నందున ఎవరు కూడా నీటి ప్రవాహం ఉన్నచోట రోడ్డు దాటరాదన్నారు. రోడ్డు పైన వాహనాలు నడిపేటప్పుడు వర్షానికి రోడ్లుపై వాహనాలు అదుపుతప్పే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలని తెలిపారు.

విద్యుత్ స్తంభాలు,కరెంటు వైర్లు, ఎలక్ట్రిక్ స్తంభాలకు దూరంగా ఉండాలని, రైతులు పొలాల దగ్గరికి వెళ్ళినపుడు స్టార్టర్లను నేరుగా తాకకుండా జాగ్రత్త వహించాలన్నారు. చాలా చోట్ల వరదల కారణంగా రోడ్డు మూసివేయడం వలన ప్రయాణికులు గమనించగలరని ఆదేశించారు.నదులు నిండి ప్రవహిస్తున్నందున మరియు చెరువులు,కుంటలు నిండుతున్నందున ఎవరు అనవసరంగా అందులో దిగరాదని హెచ్చరించారు. సెల్ఫీలు, ఫోటోల కోసం ప్రయత్నించవద్దని తెలియజేశారు. ఇంటిలోని పిల్లలు బయటకు వెళ్ళినపుడు వాళ్ళపైన నిఘా పెట్టాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు వెంటనే 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.