calender_icon.png 28 August, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మూర్ డివిజన్ లో భారీ వర్షం

28-08-2025 04:52:46 PM

అర్మూర్ (విజయక్రాంతి): అర్మూర్ డివిజన్(Armoor Division) పరిధిలో గురువారం భారీ వర్షాలు కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. భారీ వర్షాలకు పంట పొలాలు నీటిలో మునిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు నిండుకుండలా మారాయి. కొన్నిచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. చుట్టుపక్కల గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో గోవింద్ పెట్, చేపూర్, పిప్రి, మంథని తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్లలోకి వర్షపు వరద నీరు చేరింది. వరద నీరు ఇళ్ళలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కమలా నెహ్రూ కాలనీలో బండరాయి జారిపడి ఓ ఇల్లు ధ్వంసం అయింది. హౌసింగ్ బోర్డ్ కాలనీ, సిక్కుల కాలనీ, విద్యానగర్ కాలనీ, యోగేశ్వర కాలనీ, మామిడిపల్లి చౌరస్తా, కోటార్ మూర్, పెరికిట్లలోని లోతట్టు ప్రాంతాలు భారీ వర్షానికి జలమయమయ్యాయి. దింతో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతాలను జలమయమైన కాలనీలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.