18-08-2025 01:47:19 AM
జనగామ, ఆగస్టు 17 ( విజయ క్రాంతి): రైతు అకాల మరణం సంభవించినప్పుడు.. రైతుబీమాప థకం ద్వారా ప్రభుత్వం రైతుల కుటుం బాలకు ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు సహజ లేదా ప్రమాదవశా త్తు మరణాలకు జీవిత బీమా కవరేజీని అందించడం ద్వారా మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని....
ఏకారణంతోనైనారైతుచనిపోతే, నామినీకి ఎల్‌ఐసీ నుంచి 10 రోజుల్లోగా 5 లక్షలబీమాపరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు ఒక్కోరైతుకోసం...ప్రభుత్వ మే 2,271 రూపాయలను ప్రీమియంగా చెల్లించి, 5 లక్షల రూపాయలను బీమాగా అందిస్తోందన్నారు జనగామ జిల్లాలో 198072 మంది రైతులు పాసుపుస్తకాలు కలిగివున్నారని.... రైతుభీమా పధకం క్రింద 12,7,418 మంది రైతులు రిజిస్టర్ అయ్యారని కలెక్టర్ పేర్కొన్నారు.
కొత్తగా 7,240 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు రాగా.. అందులో 4194 మంది రైతుభీమా క్రింద నమోదు చేసుకున్నారని...ఇది వరకు భీమా కోసం నమోదు చేసుకున్న రైతులుకు 91.08% రెన్యూవల్ కూడా జరిగింది 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళలోపు వయసు ఉన్న రైతులందరు ఈ పథకానికి అర్హులని.. ఆధార్ కార్డుపై నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారన్నారు .
ప్రతీ ఏడాది కూడా ఆగస్టు 15నే ప్రామాణికంగా తీసుకుని పేర్లను నమోదు చేసుకుంటారని.... పట్టాదారు పాస్ పుస్తకాలున్న ప్రతి రైతుకు రైతు బీమా పథకం వర్తిస్తుందన్నారు. ఎకరం భూమి ఉన్న రైతు నుంచి వంద ఎకరాలున్న రైతుకు కూడా ఒకే రకమైన బీమా వర్తిస్తుందన్నారు. ఇప్పటికే ఈ పథకంలో నమోదైనవారు నూతనంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
జిల్లా లో రైతు భీమా కింద అర్హులుగా నమోదు చేసుకునేందుకు గడువు ముగిసిందని.. జూన్ 5వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారిని అర్హులుగా పరిగనించారన్నారు. సీసీఎల్‌ఏ(భూ భారతి) లో లేని భూములున్న రైతులకు బీమా వర్తింపు ఉండదని తాజా సర్క్యూలర్‌లో స్పష్టం చేశారు. ఏఈవోల వద్ద ఆయా గ్రామాల జాబితాలు ఉంటాయని... అయితే పేరు నమోదు చేసుకునే రైతు స్థానికంగా ఉండాలన్నారు.
పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, రైతుతోపాటు నామినీ ఆధార్కార్డుల నకలు ప్రతులను, నామినీ నమోదు పత్రాన్ని పూరించి ఏఈవోలకు ఇవ్వాలని... చట్టపరమైన వారసత్వం కలిగినవారు నామినీగా ఉండాలన్నారు . లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన కన్నేబోయిన ప్రభాకర్ అనే రైతు గుండె నొప్పి తో 19.09.2024 న మృతి చెందగా... నామినీ అయిన రైతు భార్య సరిత కి 5 లక్షల రూపాయల భీమా వారి అకౌంట్ లోకి జమ అయ్యింది.
ఈ డబ్బు వారి కుటుంబానికి ఎంతో ఆసరా అయ్యిందని...వ్యవసాయం మీద ఆధార పడి జీవిస్తున్న తమకి ఎంతో అండగా ఈరోజు భీమా ఉపయోగ పడిందన్నారు. నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన దొండకాయల నరసింహులు అనే రైతు 30-08-2024 న మృతి చెందగా నామినీ అయిన అతని భార్య దొండకాయల కవిత బ్యాంకు ఖాతా లోకి 24-9-2024 న 5 లక్షల రూపాయల భీమా వారి అకౌంట్ లోకి జమ అయ్యింది. ఈ భీమా సొమ్ము వారి ఇంటి ఖర్చులకు... అలాగే మళ్ళీ వ్యవసాయం కోసం చాలా ఉపయోగపడిందన్నారు.